J&K CM Omar Abdullah:
జమ్మూ–కాశ్మీర్ ఎన్నికల్లో ఎన్సీ, కాగ్రెస్ కు ఆధిక్యం వచ్చింది. దీంతో ఎన్సీ అధినేత ఒమర్ అబ్దుల్లా జమ్మూ–కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార చేశారు. దీని తరువాత ఆయన మొట్ట మొదటిసారిగా ఢిల్లీ వచ్చారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలిశారు. ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్‌పై రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని ప్రధాని మోడీకి ఒమర్ అందజేశారు. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్ర హోదా తీర్మానాన్ని అందజేశారు.
ఇది కూడా చూడండి:Blink it: బ్లింకిట్‌లో ఈఎంఐ ఆప్షన్..కొన్ని కొనుగోళ్ళకు మాత్రమే
ఇది కూడా చూడండి: Cyclone Dana: తీవ్రంగా దానా తుఫాను..ముందస్తు చర్యతో సంసిద్ధమైన ఒడిశా
అయితే రీసెంట్‌గానే జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కోరుతూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. దీన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఆమోదించారు. ఇపుడు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా దీనికి సంబంధించిన తీర్మానాన్నే హోంమంత్రి అమిత్ షాకు అందించారు. దీనిపై ఆయన కూడా సానుకూలంగా స్పదించినట్లు తెలుస్తోంది. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి సహకరిస్తామని.. అలాగే రాష్ట్ర హోదాను కూడా పునరుద్ధరిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కేంద్రంతో ఎలాంటి ఘర్షణలు పెట్టుకోమని.. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాల కోసం కృషి చేస్తానని ఒమర్ చెప్పారు.
Also Read: Supreme Court: సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం
Also Read: కెనడా పోలీస్,ఆర్మీల్లో ఖలిస్తాన్ వ్యక్తులు..డిప్లమాట్ సంజయ్ వర్మ