Jharkhand Earthquake: జార్ఖండ్ రాజధాని రాంచీ, జంషెడ్‌పూర్‌లో ఈ రోజు ఉదయం 9:20 సమయంలో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భూమి కంపించడంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. రీక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది.
ఇది కూడా చూడండి: Health Benefits: ఉదయాన్నే ఈ జావ తాగితే.. అనారోగ్య సమస్యలన్నీ మటాష్
దాదాపు 5 సెకన్ల పాటు కంపించడంతో..
రాంచీలోని తమడ్‌తో పాటు చైబాసాలోని చక్రధర్‌పూర్‌లో కూడా భూకంపం సంభవించింది. దాదాపు 5 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయపడి ఇంటి నుంచి బయటకు వచ్చారు.
ఇది కూడా చూడండి: కార్తీక మాసంలో ఈ పనులు చేస్తే.. దరిద్ర మంతా మీ ఇంట్లోనే..
ఇది కూడా చూడండి: Spain Floods: స్పెయిన్ వరద బీభత్సం.. 205కి చేరిన మృతుల సంఖ్య
జార్ఖండ్‌లోని ఖర్సావాన్ జిల్లాకు 13 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్ర ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇంకా ఎలాంటి సమాచారం లేదు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: Vaishnavi Chaithanya: దీపాల వెలుగులో బేబీ బ్యూటీ.. ఎంత అందంగా ఉందో..!