Hemant Soren: రాష్ట్రానికి రావాల్సిన బకాయిలకు సంబంధించి ప్రధాని మోదీకి ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సంచలన లేఖ రాశారు. మోదీ మీకో దండం మాకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రావాల్సిన ఆదాయం ఆలస్యం కావడంతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, కావున వెంటనే రూ.1.36లక్షల కోట్లు బొగ్గు బకాయిలను క్లియర్ చేయాలంటూ మోదీ, అమిత్‌షాలకు చేతులు జోడించి అభ్యర్థించారు సోరెన్.
ఇది కూడా చదవండి: కాళ్లు, చేతులు కట్టేసి ఘోరం.. ఏపీలో మరో మహిళపై గ్యాంగ్ రేప్
చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా..
ఈ మేరకు ఎక్స్ వేదికగా లేఖ విడుదల చేసిన సోరెన్.. ‘ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ, హోంమంత్రి ఝార్ఖండ్‌కు వస్తున్నారు. ఈ సందర్భంగా నేను మరోసారిని చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా. మా రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించండి. బీజేపీ ఎంపీలు కూడా బకాయిలు ఇప్పించేందుకు సంహకరించాలి’ అంటూ రిక్వెస్ట్ చేశారు. అలాగే బొగ్గు కంపెనీల తమకు రూ.1.36లక్షల కోట్లు రావాలన్నారు. చట్ట నిబంధనలున్నప్పటికీ బొగ్గు కంపెనీలు ఎలాంటి చెల్లింపులు చేయట్లేదని చెప్పారు. ఇక ఝార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13, 20న తేదిల్లో పోలింగ్ జరగనుండగా 23న ఫలితాలు విడుదలకానున్నాయి.
ఇది కూడా చదవండి: రష్యాపై ఉక్రెయిన్ క్షిపణుల దాడి.. జెలెన్‌స్కీ సంచలన నిర్ణయం!