Jammu Kashmir Floods: ఈ జిల్లాలో వరద బీభత్సం.. ముగ్గురు మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని క్లౌడ్‌ బరస్ట్‌ రాంబన్‌ జిల్లాలో ఆకస్మిక వరద బీభత్సం సృష్టించింది. ఈ వరదల్లో చిక్కుకొని ముగ్గురు మృతి చెందారు. అనేక వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. చీనాబ్ నదికి సమీప గ్రామాల్లోకి భారీగా వరద నీరు రావడంతో ఇళ్లు నేలమట్టమయ్యాయి.

New Update
jammu kashmir floods

jammu kashmir floods

jammu kashmir floods

జమ్మూకశ్మీర్‌లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈదురు గాలులు, కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా క్లౌడ్‌ బరస్ట్‌ రాంబన్‌ జిల్లాలో ఆకస్మిక వరద బీభత్సం బీభత్సం సృష్టించింది. ఈ వరదల్లో చిక్కుకొని ఇప్పటికి ముగ్గురు మృతి చెందారు. అంతేకాకుండా జమ్మూ-శ్రీనగర్ హైవేపై కొండచరియలు విరిగిపడ్డాయి. 

మరోవైపు ఈ వరదల్లో అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జాబ్ ఏర్పడింది. దీంతో వెంటనే అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. జమ్మూ-శ్రీనగర్‌ రూట్‌లో రాకపోకలు నిలిచిపోయాయి. చీనాబ్ నదికి సమీప ఉన్న గ్రామాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో దాదాపు 10 ఇళ్లు పూర్తిగా మునిపోయాయి. మరో 20-30 వరకు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఆకస్మిక వరదలో చిక్కుకుపోయిన దాదాపు వంద మందిని ధర్మకుండ్‌ పోలీసులు రక్షించారు. 

jammu-and-kashmir | jammu kashmir floods | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు