Jadeja: చాలా గర్వంగా ఉంది..భార్య మంత్రి పదవిపై జడేజా పోస్ట్

తన భార్యకు మంత్రి పదవి లభించడంపై ఆనందం వ్యక్తం చేశాడు జడేజా. దీనిపై పోస్ట్ పెడుతూ ఎంతో గర్వపడుతునన్నానని చెప్పాడు. ఇలాగే అన్ని వర్గాల ప్రజలకు ప్రేరణగా నిలుస్తావని ఆశిస్తున్నానని చెప్పాడు. 

New Update
jadeja

భారత క్రికెటర్ రవీంద్ర జడేజా...తమ భార్య మంత్రి అయిన విషయం తెలిసిన వెంటనే ఎక్స్ వేదికగా పోస్ట్ పట్టాడు. నీవు సాధించిన విజయాలకు ఎంతో గర్వపడుతున్నా అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇలాగే అద్భతమైన కృషి చేస్తూ...అన్న ఇవర్గాల ప్రజలకు ప్రరణగా నిలుస్తాని కోరుుంటున్నా అంటూ భార్యపై ప్రేమను కురిపించాడు. గుజరాత్‌ ప్రభుత్వంలో క్యాబినెట్‌ మంత్రిగా గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.. జైహింద్‌’’ అని ఎక్స్ పోస్ట్‌లో రాశాడు. 

విద్యా శాఖ బాధ్యతలు..

గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం శుక్రవారం (అక్టోబర్ 17) భారీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. కొత్తగా 25 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయగా..  వారికి శాఖలను కేటాయించారు. టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి, జామ్‌నగర్ ఉత్తర ఎమ్మెల్యే రివాబా జడేజాకు కీలకమైన విద్యా శాఖ బాధ్యతలు అప్పగించారు.  రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఆమెకు ఇంతటి కీలక బాధ్యత దక్కడం విశేషం.

2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు తెలుస్తోంది. మొత్తం 26 మందితో కూడిన ఈ మంత్రివర్గంలో సామాజిక మరియు ప్రాంతీయ సమతుల్యతకు పెద్దపీట వేశారు. కొత్త మంత్రివర్గంలో 7 మంది పాటిదార్లకు, 8 మంది ఓబీసీలకు, 3 మంది ఎస్సీలకు, 4 గురు ఎస్టీలకు అవకాశం కల్పించారు. మహిళా మంత్రుల సంఖ్యను కూడా పెంచారు.

#minsters #wife #Ravindra Jadeja #today-latest-news-in-telugu
Advertisment
తాజా కథనాలు