/rtv/media/media_files/2025/03/11/dCpE4g7cNhzMmF0sL3WA.jpg)
Sri Chaitanya Junior College
IT Raids: శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగాయి. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఏకకాలంలో 10 ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ఐటీ అధికారులు రూ.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా, కొత్త ఆర్థిక సంవత్సరం, రాబోయే విద్యా సంవత్సరం నేపథ్యంలో ఫీజుల వసూళ్లు, ఐటీ చెల్లింపులపై ఆరా తీస్తోంది ఐటీ. ఇందులో భాగంగా శ్రీచైతన్య విద్యాసంస్థల్లో సోమవారం సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీలు మంగళవారం కూడా కొనసాగాయి.
ఇది కూడా చదవండి: గుండెపోటుకు 30 రోజుల ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి
దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో ఫీజు తీసుకుని ట్యాక్స్ ఎగొట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ తయారు చేసి లావాదేవీలు నిర్వహిస్తూ.. ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కోసం మరో సాఫ్ట్ వేర్ తయారు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.లావాదేవీల మెయింటెనెన్స్ కోసం ఉపయోగించిన సాఫ్ట్ వేర్ లను పరిశీలించారు. శ్రీ చైతన్య కాలేజీలతో పాటు ట్రస్ట్, ఇతర ప్రైవేట్ కంపెనీల ట్యాక్స్ చెల్లింపులను వెరిఫై చేస్తున్నారు ఐటీ అధికారులు. శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన గత ఐదు సంవత్సరాల ఐటీ చెల్లింపుల వివరాల ఆధారంగా సోదాలు నిర్వహిస్తున్నారు. రెండు యాప్‌ల ద్వారా స్టూడెంట్స్ నుంచి ఫీజులు వసూలు చేసినట్టు గుర్తించారు. దీంతో ఫీజుల చెల్లింపులకు రెండు యాప్‌లు ఎందుకు అందుబాటులోకి తీసుకొచ్చారనే దానిపై ఆరా తీస్తున్నారు. మొత్తం శ్రీచైతన్య విద్యాసంస్థలకు ఎన్ని బ్రాంచిలు ఉన్నాయి? ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఎంతమంది స్టూడెంట్స్ ఆన్లైన్ పేమెంట్ చేశారు? ఎంత మంది నగదురూపంలో చెల్లించారు అనే వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ప్రైవేట్ భాగంలో దురద రాకుండా ఉండటానికి ఇలా చేయండి
మాదాపూర్‌లోని శ్రీచైతన్య కార్పొరేట్ కాలేజీలో రికార్డులు, డాక్యుమెంట్లు, ఐటీ రిటర్నులు, పన్ను చెల్లింపు రశీదులను పరిశీలించారు. డైరెక్టర్ల కార్యాలయాలనూ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు, రికార్డులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫీజుల విషయంలోనూ ఫిర్యాదుల రావడంతో ఈ కాలేజీలపై దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో పలు కాలేజీలకు అనుమతులు లేవని, హాస్టల్ భవనాలకు అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారని తేలింది.పరిమితికి మించి విద్యార్థులకు అడ్మిషన్లు తీసుకుంటున్నారని అధికారులు గుర్తించారు. కళాశాలల యజమాన్యాలు వెల్లడించిన వివరాలు, సోదాల్లో లభించిన వివరాలను బేరీజు వేసుకుంటున్నట్లు సమాచారం. సంస్థల్లో చేరుతున్న విద్యార్థులు, ఆదాయానికి సంబంధించిన వాటిపై ఆరా తీస్తున్నారు. పన్ను ఎగవేతకు సంబంధించిన దానిపై అధికారులు దృష్టి సారించారు.
Also read: PM Modi: ప్రధాని మారిషస్ పర్యటన.. ఇండియా ఫండ్స్‌తో 20 ప్రాజెక్టులు ప్రారంభం
తాజాగా యలమంచిలి శ్రీధర్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. మొదట మాదాపూర్ బ్రాంచ్‌లో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత యలమంచిలి శ్రీధర్ ఇంట్లో కూడా పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. అటు.. ఖమ్మంలో ఉన్న మరో డైరెక్టర్ నివాసంలో సైతం తనీఖీలు చేయడానికి అధికారులు రెడీ అయ్యారు. ప్రతి ఏటా ఫీజుల పెంపుతో పాటు అధిక మొత్తంలో అనధికారిక లావాదేవీలు చేస్తున్నట్టు గుర్తించారు. ఇందులో రెండు విధానాలను అవలంబిస్తున్నట్టు ఐటీ శాఖ అనుమానిస్తోంది. ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకునే క్రమంలో అధికశాతం ఫీజులను నగదు రూపంలోనే వసూలు చేస్తున్నారని, అతి తక్కువ శాతం మాత్రమే ఆన్‌లైన్ పేమెంట్ విధానంలో వసూలు చేస్తున్నారని ఆధారాలు సేకరించినట్టు సమాచారం.
Also Read : అబ్బా భలే ఉంది..ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైం AI-జనరేటెడ్ పాట
ఇలా వసూలు చేసిన ఫీజులకు సంబంధించి ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేసినట్లు ఐటీ సోదాల్లో బయటపడినట్టు తెలిసింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని శ్రీ చైతన్య హెడ్ ఆఫీస్‌లో తనిఖీలు కొనసాగుతున్నాయి. కాగా, 2020లోనూ శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ దాడులు జరిగాయి. ఈ తనిఖీల్లో 11 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. తాజా సోదాల్లోనూ రూ.5 కోట్లు పట్టుబడటం గమనార్హం. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో జరుగుతోన్న దాడులపై ఐటీ అధికారులు ఇప్పటికే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Also Read: ఆయుధాల దిగుమతిలో భారత్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో ఉక్రెయిన్ !