/rtv/media/media_files/2024/11/07/uH9r6RfCdplAmnmsipiC.jpg)
Shocking Incident In Bengaluru:
లైంగిక దాడులు చేయడానికి మగ, ఆడ అయితే చాలు వయసుతో సంబంధం లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం సమాజం పరిస్థితులు, వసతున్న వార్తా కథనాలు, టెక్నాలజీ అన్ని పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళవరకూ అందరినీ ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచీ డివైజ్‌లో పిల్లల చేతుల్లో ఉంటున్నాయి. తల్లిదండ్రులు కూడా తమ ఉద్యోగాలు, బాధ్యతల ఒత్తిడితో పడి పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అనేది పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో పిల్లల మెదళ్ళలోకి నానా చెత్త దూరుతోంది. ఇక కొంత మందికి తాము పుట్టి పెరిగిన ప్రాంతాలు, పరిస్థిఉల ప్రభావం వల్లనే చిన్న వయసులోనే అన్నీ తెలిసిపోతున్నాయి. అయితే తెలిస్తే తప్పు లేదు. కానీ అవి మంచివి కావు అనేది తెలియడం లేదు. దాంతో పిల్లలు చిన్న వయసలోనే ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. అందుకే నిదర్శనమే ఒకటవ తగతి అమ్మాయిని ఐదవ తరగతి అబ్బాయిలు రేప్ చేయడం లాంటి ఘటనలు. ఇలాంటిదే తాజాగా బెంగళూరులో ఒకటి జరిగింది.
Also Read: మీకు ఈ సమస్య ఉందా..? అయితే పసుపు పాలు ముట్టుకోకండి
బెంగళూరులో బీటీఎం లే-ఔట్లో ఇన్స్టాగ్రాం ఇన్ఫ్లుయెన్సర్కు చేదు అనుభవం ఎదురైంది. నేహా బిస్వాల్ అనే ఇన్స్టాగ్రాం ఇన్ఫ్లుయెన్సర్ వర్క్ ఫినిష్ చేసుకుని బీటీఎం లే-ఔట్ వీధుల్లో ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ డైలీ వ్లాగ్ చేస్తుంది. ఈమెపై పదేళ్ల పిల్లాడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నేహా నడుచుకుంటూ వెళుతుంటే...పిల్లాడు పైకి మీద ఎదురుగా వచ్చి ఆమె ఛాతి భాగాన్ని చేతులతో నొక్కేసి వెళ్ళిపోయాడు. ఊహించిన ఈ సంఘటనతో నేహా షాక్ కు గురైయ్యారు. ఇదంతా ఆమె రికార్డ్ చేస్తున్న డైలీ వ్లాగ్లో రికార్డ్ కూడా అయింది. దీనిని నేహా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకు జరిగింది చెబుతూ కన్నీరు పెట్టుకుంది.
An Instagram user, @nehabiswal120, has reported facing sexual harassment in BTM Layout, Bengaluru. She claims that while she was walking down the street, a boy on a bicycle approached her, greeted her with a "hi," and then inappropriately touched her before quickly fleeing the… pic.twitter.com/R6qXDnVUc8
— Karnataka Portfolio (@karnatakaportf) November 6, 2024
Also Read: ఫోకస్ అంతా అతడిమీదే.. జట్టులో పర్మినెంట్‌గా ఉంచండి: కుంబ్లే
నేహా బిస్వాల్ పెట్టిన వీడియోకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. నెటిజన్లు ఆమెకు అండగా నిలిచారు. పెద్ద నగరాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమైపోతోందని కామెంట్ చేశారు. మరోవైపు పోలీసులు ఈ పోలీసులు ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ యువతిపై వేధింపులకు పాల్పడిన మైనర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఘటన జరిగిన వేంటనే..నేహా అరవడంతో...స్థానికులు పిల్లాడిని అక్కడే పట్టుకున్నారు. అందరూ కలిపి ఆ అబ్బాయిని కొట్టారు కూడా. కానీ తెలియక చేసి ఉండవచ్చు, పిల్లాడు అని చెప్పడంతో నేహా ఆ అబ్బాయి మీద కంప్లైంట్ చేయకుండా వదిలేసింది.
Also Read: Elon Musk: ట్రంప్ విజయం..ఎలాన్ మస్క్‌కు డబ్బులే డబ్బులు
Also Read: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!