Indigo: ఆ ప్రయాణికులకు రూ.10 వేల ట్రావెల్ వోచర్..ఇండిగో బంపర్ ఆఫర్

గత వారం అంతా ఇండిగో సంక్షోభంలో వల్ల లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఇండిగో పూర్తిస్థాయిలో తన కార్యకలాపాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దాంతో పాటూ ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు పరిహారం ప్రకటించింది. 

New Update
IndiGo offers full refunds

IndiGo offers full refunds

డిసెంబర్ 3 నుంచి 5 మధ్య ఇండిగో విమాన సర్వీసులు దాదాపు చాలామట్టుకు రద్దయ్యాయి. చాలా విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎయిర్ పోర్ట్ ల్లో చిక్కుకుని నానా పాట్లు పడ్డారు. అలా తీవ్రంగా ఇబ్బందులుపడిన ప్రయాణికులకు ఇండిగో పరిహారం ప్రకటించింది. వారందరికీ ట్రావెల్ వోచర్లు ఇస్తామని చెప్పింది. ఒక్కొక్కరికీ రూ.10 వేల విలువైన ట్రావెల్ వోచర్లను అందిస్తామని తెలిపింది. రానున్న 12 నెలల్లో దేశం మొత్తంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా వాడుకోవచ్చని చెప్పింది. అయితే ఈ వోచర్లకు ఏ ప్రయాణికులను, ఎంత మందిని ఎన్నిక చేస్తారనే వివరాలను మాత్రం తెలపలేదు. 

ఈ ఒక్క రోజే 1950 సర్వీసులు..

ప్రస్తుతం ఇండిగో పరిస్థితి బాగు పడింది. అది తన కార్యకలాపాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ రోజు ఇండిగో మొత్తం 1950 విమాన సర్వీసులను నడుపుతోందని.. ఇందులో 3 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారని తెలిపింది. సర్వీసుల పునరుద్ధరణ రోజురోజుకూ మెరుగవుతోంది. ఈ రోజు మా నెట్‌వర్క్‌ పరిధిలోని 138 గమ్యస్థానాలను అనుసంధానించేలా మా సర్వీసులు కొనసాగనున్నాయని ఇండిగో సంస్థ తెలిపింది. వాతావరణం, సాంకేతిక, నియంత్రణలోని కొన్ని కారణాల వల్ల మాత్రమే స్వల్ప సంఖ్యలో విమానాలు రద్దవుతున్నాయని చెప్పింది.

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు(indigo airlines flight) పెద్ద ఎత్తున రద్దు కావడం, ఆలస్యం కావడం వల్ల తలెత్తిన సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA)కు ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. సవరించిన FDTL నిబంధనలు: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అమలులోకి తెచ్చిన కొత్త 'ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్' (FDTL) నిబంధనలు. పైలట్‌లు, సిబ్బంది విశ్రాంతి సమయాన్ని పెంచడం వల్ల రోస్టర్ నిర్వహణలో పెద్ద సవాలు ఎదురైందని ఇండిగో తెలిపింది. దాంతో పాటూ సాధారణంగా తలెత్తే చిన్నపాటి టెక్నికల్ సమస్యలు, ప్రతికూల వాతావరణం.. ముఖ్యంగా శీతాకాలంలో పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు మరియు ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడిందని చెప్పింది. అలాగే శీతాకాల షెడ్యూల్ మార్పులు:వింటర్ షెడ్యూల్‌ను అమలు చేసే క్రమంలో చేయాల్సిన షెడ్యూల్ సర్దుబాట్లు, విమానయాన వ్యవస్థలో పెరిగిన రద్దీ మరియు విమానాశ్రయాలలో కార్యకలాపాల ఒత్తిడి లాంటి అనుకోని, ఊహించని పరిస్థితులను చెప్పింది. 

Advertisment
తాజా కథనాలు