/rtv/media/media_files/2025/12/06/rammohan-2025-12-06-11-01-43.jpg)
దేశ వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ఇండిగో విమానాల వల్ల ప్రజలు నానా పాట్లూ పడుతున్నారు. ఎయిర్ పోర్ట్ లు రణరంగంగా మారుతున్నాయి. మిగతా అన్ని విమానాలు సరిగ్గానే నడుస్తున్నాయి, వాటి లగేజీ నిర్వహణలో ఎటువంటి ప్రాబ్లెమ్స్ రావడం లేదు. కానీ ఇండిగో విమానాల విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా ఆ సంస్థ విమానాలు రద్దవుతున్నాయి. మరికొన్ని చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి.
తప్పంతా వారిదే..
ఇటీవల డీజీసీఏ FDTL నిబంధనలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. పైలట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతిని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచింది. నవంబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అలాగే రాత్రి సమయాల్లో ల్యాండింగ్స్‌ను పరిమితం చేసింది. ఇవన్నీ నవంబర్ నుంచే అమల్లోకి వచ్చాయి. మిగతా విమానయాన సంస్థలన్నీ కొత్త రూల్స్ ప్రకారం అన్ని సర్వుబాట్లు చేసుకున్నాయి. తమ విమానాల డ్యూటీ పరిమితుల నిబంధనలకు అనుగుణంగా మార్చుకున్నాయి. కానీ ఇండిగో సంస్థ మాత్రం నిర్లక్ష్యం చేసింది. దీంతో ఒక్కసారిగా ప్రాబ్లెమ్ పెద్దగా అయింది. దీనంతటికీ ఇండిగో సంస్థనే కారణమంటున్నారు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇండిగో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇబ్బందులు ఎదుర్కొంటందని అన్నారు.
అన్ని చర్యలూ తీసుకుంటున్నాం..
అయితే పరిస్థితులు తొందరలోనే మెరుగుపడతాయని ప్రయాణికులకు ఆయన హామీ ఇచ్చారు. సమసయ పరిష్కార అయ్యే దిశలో ఉందని చెప్పారు. అన్ని మెట్రో విమానాశ్రయాల్లో ప్రయాణికుల బకాయిలన్నింటినీ తొలగించారు. మిగిలినవి కూడా కూడా ఈ రోజు రాత్రికి పూర్తవుతాయి. రేపటి నుంచి ఇండిగో పరిమిత సామర్థ్యంతో ఎటువంటి సమస్యలూ లేకుండా తన కార్యకలాపాలు కొనసాగిస్తుందని మంత్రి చెప్పారు. రాను రాను మొత్తం సమసయలు తొలిగిపోయేలా ఇండిగో చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దీనికి కొన్ని రోజులు పడుతుందని..అప్పటి వరకు ప్రయాణికులు ఓపిగ్గా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇండిగో తప్పిదంలో విమానయాన శాఖ, లేదా డీజీసీఏ తప్పు లేదని...తాము నిరంతరం విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. కొత్త FDTL నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయని...యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ గత వారం ఎయిర్‌బస్ A320 లకు నవీకరణలను తప్పనిసరి చేసిందని.. 323 విమానాలకు ఎటువంటి అంతరాయాలు లేకుండా తక్కువ సమయంలోనే అది పూర్తయిందని ఆయన మంత్రి రామ్మోహన్ తెలిపారు. ఇండిగో తప్పిదాలపై విచారించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. తమ తప్పు ఉంటే అన్ని విమానయాన సంస్థలూ ఇబ్బందులు ఎదుర్కోవాలి కానీ ఒక్క ఇండిగోకే సమస్యలు వచ్చాయని చెప్పుకొచ్చారు. అయినా కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.
Follow Us