Hydropower Project : చైనాకు పోటీగా బ్రహ్మపుత్రపై భారత్ మాస్టర్ ప్లాన్..6.4 లక్షల కోట్లతో  భారీ ప్రాజెక్ట్..!

భారత్, చైనాలను అనుసంధానిస్తూ ప్రవహించే నది బ్రహ్మపుత్ర. దీనిపై చైనా ఇప్పటికే భారీ ప్రాజెక్టును మొదలెట్టింది. ఇప్పుడు భారత్ కూడా ఈ నదిపై మాస్టర్ ప్లాన్ చేసింది. రూ.6.4 లక్షల కోట్లతో 208 ప్రాజెక్టులు నిర్మించడానికి రెడీ అవుతోంది. 

New Update
brhamaputra

భారతదేశం మొత్తానికి సరిపడేలా విద్యుత్ ను ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతంలో భారీ ప్రాజెక్టులను నిర్మించాలని ప్లాన్ చేసింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) తెలిపిన వివరాల ప్రకారం.. 2047 నాటికి బ్రహ్మపుత్రా నదీ పరీవాహక ప్రాంతం నుంచి 76 గిగావాట్లకు పైగా జలవిద్యుత్‌‌ను ఉత్పత్తి చేసి, దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించే విధంగా భారీ ప్రణాళికను రూపొందించింది. దీని కోసం రూ.6.4 లక్సల కోట్లను ఖర్చు పెట్టనుంది. 

208 భారీ హైడ్రా ప్రాజెక్టులు..

ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రవహించే బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతాల్లో 208 భారీ హైడ్రో ప్రాజెక్టులు నిర్మించనున్నామని సీఈఏ తెలిపింది. వీటి ద్వారా 64.9 గిగావాట్ల విద్యుత్, పంపింగ్ స్టోరేజ్ ప్లాంట్ల ద్వారా అదనంగా మరో 11.1 గిగావాట్ల విద్యుత్‌ కలిపి మొత్తం 76 గిగావాట్లు ఉత్పత్తి చేయనున్నామని లెక్కలు చెప్పింది. భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ లో పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది. ఇది ఇక్కడ గణనీయమైన జలశక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అందుకే పక్క దేశం చైనా కూడా దీనిపై భారీ ప్రాజెక్టును నిర్మించేందుకు సిద్ధమైంది. దీనివలన వేసవి కాలంలో భారత్ వైప్ వచ్చే ప్రవాహం దాదాపు 80 శాతం తగ్గిపోతుందని ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. చైనా నిర్మిస్తోన్న ఈ విద్యుత్ ప్రాజెక్ట్ సామర్థ్యం ఏకంగా 60,000 మెగావాట్లు. దీనిని అరికట్టాలంటే భారత్ వైపు కూడా అంతే పెద్ద ఎత్తున ప్రాజెకట్లు నిర్మించాలి. అప్పుడు ఇరు దేశాలకూ సమానంగా నదీ ప్రవాహం ఉపయోగపడుతుంది. ఈ ప్రణాళికలో నేషనల్ హైడ్రో-ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC),నార్త్-ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NEEPCO), సట్లెజ్ జలవిద్యుత్ నిగమ్ (SJVN) వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను కేటాయించిన ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే అమల్లో ఉన్నాయి. కాగా, 2030 నాటికి 500 గిగావాట్ల కర్బన రహిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని, 2070 నాటికి కర్బన రహిత ఉద్గారాలను సాధించాలనే లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisment
తాజా కథనాలు