Agniveer Vayu Recruitment 2026: అగ్నివీర్ వాయు-2026 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..

'అగ్నివీర్ వాయు' 2026 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 27ను చివరితేదీగా నిర్ణయించారు. ఇంటర్ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

New Update
Agniveer Vayu 2026 notification

Agniveer Vayu Recruitment 2026

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) తాజాగా ‘అగ్నివీర్ వాయు-2026’ నోటిషికేషన్‌ను విడుదల చేసింది. ఇంటర్‌ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా విద్యార్హత ఉన్నవారు అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 7 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అగ్నిపథ్ స్కీం కింద అగ్నివీర్ వాయు (01/ 2026) నియామకాలకు సంబంధించి నోటిషికేషన్ విడుదల చేసింది. ఇంటర్ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు
07.01.2005 నుంచి 01.07.2008 మధ్య జన్మించి ఉండాలి.

ఇది కూడా చూడండి: తొక్కిసలాటకు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

జనవరి 27 వరకు

పురుషులతో పాటు మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు. పురుషులు 152 సెం.మీ ఉండాలి. మహిళలు 152 సెం.మీ ఉండాలి. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఇది కూడా చూడండి: ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన కరుణాకర్‌రెడ్డి

విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ (10+2)/ ఇంటర్మీడియట్‌ (సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు) లేదా 3ఏళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా (మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/కంప్యూటర్ సైన్స్/ ఆటోమొబైల్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీలో తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఇది కూడా చూడండి: అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 22 నుంచి ఆన్‌లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. నవంబర్ 14న ఫలితాలు వెల్లడించనున్నారు. అనంతరం ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్టు ఆధారంగా ఎంపికచేయనున్నారు. ఇక ఈ అగ్నివీర్ వాయు జాబ్‌లకు సెలక్ట్ అయిన వారికి తొలి ఏడాది నెలకు రూ.30వేలు అందిస్తారు. రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.36వేలు, నాలుగో ఏడాది రూ.40వేలు చెల్లిస్తారు. ఇక 4ఏళ్ల తర్వాత బయటకు వచ్చేసిన వారికి ‘సేవానిధి ప్యాకేజీ’ కింద రూ.10.04 లక్షలు చెల్లిస్తారు. 

                                                    పూర్తి వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్చేయండి.

ఇది కూడా చూడండి: బాలయ్యకు బిగ్ షాక్.. డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ క్యాన్సిల్!

Advertisment
తాజా కథనాలు