పాకిస్తాన్‌కు బిగ్‌షాక్ ఇవ్వడానికి ఆఫ్ఘనిస్తాన్ రెడీ అయిపోతుంది. భారత్ లైన్‌లోనే పాకిస్తాన్‌పై ఆఫ్ఘనిస్తాన్ వాటర్ బాంబ్ పేల్చబోతుంది. కునార్ నదిపై మరిన్ని డ్యామ్స్ నిర్మించేందుకు అక్కడి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. దీని ద్వారా పాకిస్తాన్‌కు పూర్తిగా నీటి ప్రవాహం ఆపాలని ఆఫ్ఘనిస్తాన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కునార్ ప్రాంతాన్ని అఫ్గాన్ ఆర్మీ జనరల్ ముబిన్ తాజాగా సందర్శించారు. ఈ నీళ్లు తమ రక్తంతో సమానమని ఆయన వెల్లడించారు. తమ అవసరాలు తీరాకే నీళ్లు వదులుతామని ఆయన స్పష్టం చేశారు. హిందు కుష్ పర్వతాల్లో కునార్ నది పుట్టింది. పాకిస్తాన్‌లో ప్రవేశించే ముందు కాబూల్ నదిలో కలుస్తుంది. తర్వాత పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లోకి ప్రవేశిస్తుంది. కాగా పాకిస్తాన్, అఫ్గాన్ మధ్య ఎప్పటి నుంచో జలవివాదం నడుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్‌తో సింధూ జలాలను భారత్ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.
కునార్ నదిపై
ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం కునార్ నదిపై మరో ప్రధాన జలవిద్యుత్ ఆనకట్టను ప్రకటించినప్పుడు పాకిస్తాన్ లో ఆందోళనలు మరింత పెరిగాయి. దాదాపు 480 కిలోమీటర్ల పొడవున్న కునార్ నది కూడా హిందూకుష్ పర్వతాల నుండి ఉద్భవించి కాబూల్ నదిలో కలిసే ముందు పాకిస్తాన్‌లోకి ప్రవేశిస్తుంది. కాబూల్, కునార్ నదులు కూడా సింధు పరీవాహక ప్రాంతంలో ముఖ్యమైన భాగం. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తాలిబన్ ప్రభుత్వం దేశ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రణాళికలలో ఈ ప్రాజెక్ట్ భాగమని చెప్పాలి.
ఇక మే 15 సాయంత్రం భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ముత్తాకీ మధ్య ఇటీవల సంబాషణ జరిగిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్‌లో భారత సహాయంతో అభివృద్ధి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి జైశంకర్, ముత్తాకి అంగీకరించారని సమాచారం. దీనికి సంబంధించి ఫిబ్రవరి 2021లో రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కానీ కాబూల్‌లో అధికార మార్పు దానికి బ్రేక్ వేసింది. వాస్తవానికి, కాబూల్ నదిపై నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మరియు దేశంలో నివసిస్తున్న సుమారు 20 లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తుంది. దాదాపు మూడు సంవత్సరాలలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టులో, ఆఫ్ఘనిస్తాన్‌లోని 4,000 హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుంది. ఈ ఆనకట్ట నిర్మాణం పూర్తయితే, పాకిస్తాన్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి.
india | pakistan | afghanistan | Taliban Government | telugu-news