BIG BREAKING: నోటామ్ రిలీస్ చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్

ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో రాజస్థాన్‌లో మే 7, 8 తేదీల్లో ఎయిర్ ఫోర్స్ వైమానిక విన్యాసాలు చేయనుంది. దీనికోసం భారతదేశం ఎయిర్‌మెన్ (NOTAM)కు నోటీసు జారీ చేసింది. ఇందులో రాఫెల్, మిరాజ్ 2000, సుఖోయ్-30లు సహా అన్ని ఫ్రంట్‌లైన్ విమానాలు పాల్గొంటాయి.

New Update
NOTAM

NOTAM

దేశంలో యుద్ధం తప్పదనేలా పరిస్థితులు మారుతున్నాయి. పాకిస్తాన్‌కు గట్టి కౌంటర్ ఇవ్వాలని భారత్ కోరుకుంటోంది. ఎప్పటి నుంచో ఉన్న జమ్మూ కశ్మీర్ సమస్యకు పుల్ స్టాప్ పెట్టాలని కోరుకుంటోంది. ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో రాజస్థాన్‌లో మే 7, 8 తేదీల్లో ఎయిర్ ఫోర్స్ వైమానిక విన్యాసాలు చేయనుంది. దీనికోసం భారతదేశం ఎయిర్‌మెన్ (NOTAM)కు నోటీసు జారీ చేసింది. సాధారణ కార్యాచరణ సంసిద్ధత విన్యాసాలలో భాగంగా IAF రాజస్థాన్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఈ విన్యాసాలు నిర్వహిస్తుంది. 

నోటమ్ ప్రకారం.. ఈ ఎక్స్‌ర్‌సైజ్ మే 7న మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమై మే 8న రాత్రి 9:30 గంటలకు ముగుస్తుంది. ఇందులో రాఫెల్, మిరాజ్ 2000, సుఖోయ్-30లు సహా అన్ని ఫ్రంట్‌లైన్ విమానాలు పాల్గొంటాయి. ఈ సమయంలో సరిహద్దుకు దగ్గరగా ఉన్న విమానాశ్రయంలో ల్యాండింగ్, టేక్‌కాఫ్‌లు నిలిపివేయబడతాయి. సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ కూడా ఇండియా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో నిర్వహిస్తోంది. 1971లో పాక్‌తో యుద్ధం తర్వాత ఈ రకమైన పౌర రక్షణ సన్నాహాలు జరగలేదు.

( indian-air-force | rajasthan | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు