India-China: భారత్, చైనాల మధ్య విమానాలు..అక్టోబర్ 26 నుంచి..

భారత్, చైనాల మధ్య తిరిగి రాకపోకలు ప్రారంభం అవనున్నాయి. అక్టోబర్ 26 నుంచి ఇరు దేశాల మధ్య ఫ్లైట్లు తిరుగుతాయని భారత మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  ఐదేళ్ళ తర్వాత మళ్ళీ భారత్, చైనాల మధ్య డైరెక్ట్ గా విమానాలు తిరగనున్నాయి. 

New Update
Flight charges

Flight charges

కోవిడ్ 19, గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్ , చైనా దేశాల మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. అయితే రీసెంట్ గా జరిగిన షాంఘై శిఖరాగ్ర చర్చల తర్వాత ఇరు దేవాల మధ్యా మళ్ళీ పొత్తు కుదిరింది. భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ లు చాలా వాటి మీద ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటిల్లో భారత్, చైనాల మధ్య రాకపోకలు కూడా ఉన్నాయి. వీటిని వీటిని పునరుద్ధరించేందుకు ఇరుదేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగశాఖ తెలిపింది. శీతాకాలం షెడ్యూల్ ను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 26 నుంచి రెండు దేశాల మధ్యా డైరెక్టు విమాన సర్వీసులు పునఃప్రారంభించేందుకు రెండు దేశాలకు చెందిన విమానయాన సంస్థలు ఏర్పాట్లు చేసుకుంటాయని తెలిపింది.

సంబంధాలు బాగుపడుతున్నాయి..

కొన్ని రోజుల క్రితం భారత్ , చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. చాలా రోజులుగా ఇరు దేశాల నేతలూ వరుసగా చర్చల్లో పాల్గొంటున్నారు. భారత ప్రధాని మోదీ చైనాకు వెళ్ళారు. ఆ దేశ విదేశాంగ మంత్రి వాగ్ యి భారత్ పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా వాంగ్ యి ని కలవడం ఆనందంగా ఉందని మోదీ అన్నారు. భారత్, చైనా సంబంధాల్లో పురోగతి కనిపిస్తోందని అన్నారు. గత ఏడాది రష్యాలో కజాన్ లో చైనా అధ్యక్షుడు జెన్ పింగ్ తో భేటీ తర్వాత రెండు దేశాల సంబంధాల్లో మార్పులు వచ్చాయని మోదీ అన్నారు. పరస్పర ప్రయోజనాలను, సున్నిత అంశాలను గౌరవించడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పారు.వాంగ్ యీ భేటీ తర్వాత ఇది మరింత మెరుగుపడిందని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

దీని తరువాత ప్రధాని మోదీ షాంఘైలోని ఎస్సీవో శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ ప్రధాని మోదీ- జిన్‌ పింగ్‌లతోపాటు ఇరు దేశాల విదేశాంగ అధికారుల మధ్య పలుసార్లు భేటీలు జరిగాయి. వాటిల్లో గల్వాన్ ఘర్షణలు, విమాన సర్వీసులు వంటి అంశాలపై చర్చలు, ఒప్పందాలు జరిగాయి. రెండు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకోవడం, ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి కనిపించింది. ఆ సమయంలోనే విమాన సేవలను తిరిగి ప్రారంభించేందుకు అంగీకరించారు. ఇప్పుడు ఐదేళ్ళ తర్వాత మళ్ళీ భారత్, చైనాల మధ్య డైరెక్ట్ గా విమానాలు తిరగనున్నాయి. 

Advertisment
తాజా కథనాలు