Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌తో సరికొత్త రికార్డు బద్దలుకొట్టిన భారత్..!

ఆపరేషన్ సిందూర్‌తో భారత్ సరికొత్త రికార్డును బద్దలుకొట్టింది. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఐదు ఫైటర్ జెట్‌లు, ఒక భారీ విమానాన్ని కూల్చివేసినట్లు భారత వాయుసేన చీఫ్ తెలిపారు. విమానాన్ని 300 కిలోమీటర్ల దూరం నుంచి కూల్చివేసి ప్రపంచ రికార్డు సాధించింది.

New Update
operation

operation

పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌పై విరుచుకుపడింది. అయితే దీంతో భారత్ సరికొత్త రికార్డును బద్దలుకొట్టింది. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఐదు ఫైటర్ జెట్‌లు, ఒక భారీ విమానాన్ని కూల్చివేసినట్లు భారత వాయుసేన చీఫ్ తెలిపారు. విమానాన్ని 300 కిలోమీటర్ల దూరం నుంచి కూల్చివేసి ప్రపంచ రికార్డు సాధించినట్లు వెల్లడించారు. గతంలో ఏ దేశం కూడా ఇంత దూరం నుంచి గగనతల లక్ష్యాన్ని ఛేదించిన రికార్డులు లేవు. ఇంతకు ముందు 2024లో ఉక్రెయిన్, రష్యాకు చెందిన ఒక నిఘా విమానాన్ని కూల్చివేసింది. అయితే అది 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాన్ని కూల్చివేసింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్‌ ద్వారా భారత్ ఈ రికార్డును బద్దలు కొట్టింది. ఈ విజయానికి ప్రధాన కారణం ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ అని తెలిపారు.

ఇది కూడా చూడండి: Pakistan: మా యుద్ధ విమానాలు ఒక్కటి దెబ్బతినలేదు.. కౌంటర్ ఇచ్చిన పాక్

ఎస్-400 వ్యవస్థ ప్రత్యేకతలు

ఎస్-400 ట్రయంఫ్ అనేది రష్యా తయారు చేసిన ఒక ఆధునిక గగనతల రక్షణ వ్యవస్థ. ఇది యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను కూడా చాలా దూరం నుంచి కూల్చివేయగలదు. ఈ వ్యవస్థలో వాడే 40ఎన్6 క్షిపణి 400 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను ఛేదించగలదు. భారత్ 2018లో రష్యాతో 543 కోట్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకుని మొత్తం ఐదు ఎస్-400 వ్యవస్థలను కొనుగోలు చేసింది. వాటిలో మూడు వ్యవస్థలు ఇప్పటికే భారత్‌కు వచ్చాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లో ఒక్కో వ్యవస్థను భారత సైన్యం పెట్టింది. ఇదే వార్‌లో ముఖ్య పాత్ర పోషించింది. దగ్గరలో ఉన్న విమానాలను కూల్చవచ్చు. కానీ దూరంలో ఉన్న విమానాలను కూల్చింది. ఎస్-400 వ్యవస్థలో ఇలాంటి ఆయుధాలు ఉండడం వల్లనే భారత్ ఈ అద్భుతమైన విజయాన్ని సాధించగలిగింది. ఈ కారణంగానే పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత సరిహద్దు వరకు రావడానికి డేరింగ్ చేయలేదు. ఎస్-400 వ్యవస్థ శత్రు దేశాల జామింగ్ విధానాలను కూడా తట్టుకోగలదు. దీనివల్ల భారత్ భవిష్యత్తులో కూడా ఎన్నో రికార్డులను సృష్టించనుంది.

ఇది కూడా చూడండి: Army Chief Upendra Dwivedi: ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ తో భారత సైన్యం చెస్ ఆడింది..ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది

Advertisment
తాజా కథనాలు