/rtv/media/media_files/2025/01/14/1tEIN5quxBq5uU5dAJL2.jpeg)
Sharad Pawar
మరికొన్ని రోజుల్లో మహారాష్ట్రలోని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సహా స్థానిక సంస్థల ఎన్నికలు జరనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేసే ఛాన్స్ ఉందని మహావికాస్ అఘాడి కూటమిలోని శివసేన (UBT) ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్సీపీ (SP) అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయి ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రమే ఇండియా కూటమి ఏర్పడిందని అన్నారు. అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఎప్పుడూ కూడా తాము చర్చలు జరపలేదని చెప్పారు.
Also Read: దండకారణ్యంలో హై టెన్షన్.. హిడ్మాను చుట్టుముట్టిన భద్రతా బలగాలు
'' ఇండియా కూటమి వచ్చినప్పుడు దేశంలో ఉన్న సమస్యలు, జాతీయ స్థాయి ఎన్నికల గురించి మాత్రమే చర్చలు జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తావన రాలేదు. ముంబయి స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలా ? వద్దా ? అనేదానిపై 8 -10 రోజుల్లో ఎంవీయే కూటమి పార్టీలు సమావేశమవుతాయని'' శరద్ పవార్ తెలిపారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు ఎన్సీపీ (SP) మద్దతిస్తోందని కాంగ్రెస్ ఆరోపణలను ఆయన ఖండించారు. విపక్షాలన్నీ కేజ్రీవాల్ సాయం చేయడమే మంచిదని పేర్కొన్నారు.
Also Read: పండగ పూట విషాదం.. జమ్మూకశ్మీర్‌లో పేలుడు
ఇదిలాఉండగా.. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయతి కూటమి అధికారంలోకి రాగా.. మహావికాస్ అఘాడి కూటమి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో కార్పొరేట్‌తో స్థానిక సంస్థకలు జరగనుండటంతో శివసేన యూబీటీ తాము ఒంటరిగా పోటీ చేసే ఛాన్స్ ఉందని చెప్పడంతో రాజకీయంగా దుమారం రేగింది. దీంతో మహా వికాస్ కూటమిలో కూడా విభేదాలు వచ్చాయని ప్రచారాలు నడుస్తున్నాయి. మరి రాబోయే ఎన్నికల్లో మహావికాస్ అఘాడిలో ఉన్న పార్టీలు కలిసి పోటీ చేస్తాయా ? లేదా విడి విడిగా పోటీ చేస్తాయా అనేదానిపై ఆసక్తి నెలకొంది.
Also Read: మెటా CEO మార్క్ జుకర్ బర్గ్‌కు పార్లమెంటరీ నోటీసులు..!