PM Modi Warning to Pakistan: సింధూ జలలాపై పూర్తి హక్కులు మావే అంటూ.. పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ప్రధాని!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌ను స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నీళ్లు, రక్తం ఒకే చోట పారవంటూ హెచ్చరించారు. సింధూ జలలాపై పూర్తి హక్కులు మనకే ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు.

New Update
Pm Modi

Pm Modi

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌ను స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నీళ్లు, రక్తం ఒకే చోట పారవంటూ హెచ్చరించారు. సింధూ జలలాపై పూర్తి హక్కులు మనకే ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. 70 ఏళ్లుగా పాకిస్తాన్ మన నీళ్లను తీసుకుంది.. సింధూ నీళ్లను మన కోసమే వాడుకుందానమి ప్రధాని మోదీ తెలిపారు. పాకిస్తాన్‌తో అసలు చర్చల ప్రసక్తే లేదు. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌తో పాటు ప్రపంచానికి మన సత్తా ఏంటో తెలిసిందని అన్నారు. ఉగ్రవాదానికి ఎవరు సహకరించినా అంతు చూస్తానని ప్రధాని మోదీ తెలిపారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: సామాన్యులకు మోదీ స్వాతంత్ర్య దినత్సవ కానుక.. భారీగా తగ్గనున్న నిత్యవసర ధరలు

నిత్యావసర వస్తువుల ధరలు కూడా..

ఇదిలా ఉండగా దీపావళికి జీఎస్టీలో మార్పులు చేస్తామని, దీని ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని ప్రజలకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. జీఎస్టీ వల్ల ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  జీఎస్టీ వ్యవస్థను మరింత సులభతరం చేయడానికి, పన్నుల భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే త్వరలోనే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుందని వెల్లడించారు. అలాగే 'ప్రధానమంత్రి వికసిత్ భారత్' పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. యువత కోసం ఇందులో రూ.లక్ష కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు.

ఎవరికైతే మొదటిసారి ఉద్యోగం వస్తోందో వారికి రూ.15 వేల చొప్పున అందించనున్నట్లు వెల్లడించారు. ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు మోదీ ఈ ప్రసంగంలో తెలిపారు. గతంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న భారత్ ప్రస్తుతం స్వయం సమృద్ధి దిశగా నడుస్తోంది. ఒకప్పుడు తిండికి ఇబ్బంది పడిన దేశం నేడు ప్రపంచానికి ఎగుమతి చేస్తోంది. అన్ని రంగాల్లో భారత్ స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోందని అన్నారు. అలాగే త్వరలో మేడిన్ ఇండియా చిప్‌లు కూడా మార్కెట్‌లో వస్తాయని మోదీ తెలిపారు. మేకిన్ ఇండియా అంటే ఏంటో ఆపరేషన్ సిందూర్ తెలిపింది. 

ఇది కూడా చూడండి:  Independence Day 2025: ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన ప్రధాని మోదీ

Advertisment
తాజా కథనాలు