/rtv/media/media_files/2025/03/01/abrbkGEodgOxCrPxrATT.jpg)
IIT Baba
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో గత కొన్నిరోజుల పాటు జరిగిన కుంభమేళా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పలువురు వ్యక్తులు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందులో ఐఐటీ బాబా కూడా ఒకరు. ఈయన అసలు పేరు అభయ్ సింగ్. అయితే ఈ ఐఐటీ బాబా ఓ టీవీ ఛానల్‌లో ఇంటర్వ్యూ ఇస్తుండగా.. పలువురు వ్యక్తులు తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ సంఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
Also read: యూఎస్ ఎయిడ్ నిలిపివేత.. భారత్‌లో మూతపడ్డ ఆ క్లినిక్‌లు
ఇక వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం నోయిడాలోని ఓ టీవీ ఛానల్‌కు ఐఐటీ బాబా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొందరు కాషాయ దుస్తులు వేసుకోని ఇంటర్వ్యూ జరుగుతున్న గదిలోకి వచ్చారు. వాళ్లు తనతో అసభ్యంగా ప్రవర్తించి, దాడికి పాల్పడ్డారని అభయ్ సింగ్ ఆరోపణలు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ అవుట్ పోస్టు ముందు ఆందోళన చేశారు. చివరికి అధికారులు జోక్యం చేసుకొని ఆయన్ని అక్కడినుంచి పంపించారు. అయితే ఈ ఘటనకు ముందు ఐఐటీ బాబా ఛాన్ యాంకర్‌పై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
News Nation में हुआ पूरा बवाल यहां है 👇 pic.twitter.com/pbRrZg5Nsu
— Govind Pratap Singh | GPS (@govindprataps12) February 28, 2025
Also Read: పక్కన ఇద్దరుండగానే మూడో వాడికి ముద్దులు.. మద్యం మత్తులో యువతి హల్ చల్!
ఇదిలాఉండగా అభయ్ సింగ్.. ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత కొంతకాలం పాటు ఓ కార్పొరేట్ సంస్థలో పనిచేశారు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి ఫోటోగ్రఫీపై దృష్టి సారించారు. చివరికీ ఆధ్యాత్మికం వైపు వెళ్లారు. ఇటీవల కుంభమేళా జరిగినప్పుడు ఓ వార్తా ఛాన్‌లో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఐఐటీలో చదివి ఇలా బాబా మారడంతో అభయ్ సింగ్.. ఐఐటీ బాబాగా సోషల్ మీడియాలో వైరలయ్యారు.
Also Read: నన్ను రేప్ చేశారు’.. ప్రైవేట్ పార్ట్‌లో బాటిల్‌తో - సీన్ రివర్స్ కావడంతో మహిళ అరెస్ట్!