/rtv/media/media_files/2025/04/24/idW8HpLijtqgvr3rbdvs.jpg)
Bharat Bhushan
పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బాధితులు కాళ్లు పట్టుకుని, చేతులెత్తి దండం పెట్టిన వదల్లేదు. ఈ ఉగ్రదాడిలో 35 ఏళ్ల భరత్ భూషణ్ తన ప్రాణాలు కోల్పోయాడు. అందరినీ కాల్చేస్తూ ఓ ఉగ్రవాది తమ వద్దకు రాగా.. తనకు మూడేళ్ల చిన్నారి ఉన్నందున విడిచిపెట్టాలని భరత్ భూషణ్ వారిని కోరినా పట్టించుకోకుండా తన భర్తను మూడు నిమిషాల పాటు అతి దారుణంగా కాల్చేశాడని భరత్ భార్య సుజాత వాపోయింది.
Also Read : ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!
దయచేసి నన్ను వదిలేయండి
భరత్ భూషణ్ భార్య సుజాత భూషణ్ ప్రముఖ డాక్టర్. ఈ దంపతులకు మూడేళ్ల చిన్నారి ఉంది. బెంగళూరులో స్థిరపడిన వీరంతా 2025 ఏప్రిల్ 18న విహారయాత్ర కోసమని కశ్మీర్ వెళ్లారు. ఏప్రిల్ 23న బెంగళూరుకు తిరిగి వెళ్లాల్సి ఉండగా.. మంగళవారం మధ్యాహ్నం పహల్గాం సమీప ప్రాంతానికి వెళ్లి అక్కడ సరదాగా తమ చిన్నారితో గడిపారు. అప్పుడు అకస్మాత్తుగా కాల్పలు శబ్ధాలు రావడంతో వెంటనే ముగ్గురం పక్కనే ఉన్న గుడారాల వెనుక దాక్కున్నారు. ఇది గమనించిన ఓ ఉగ్రవాది తమ దగ్గరికి వచ్చాడని సుజాత తెలిపారు. తన భర్త ఆ ఉగ్రవాదిని ‘‘నాకు ఒక బిడ్డ ఉంది. దయచేసి నన్ను వదిలేయండి’ అని అడిగాడు. అయినప్పటికీ ఆ ఉగ్రవాది కనికరించలేదు. తన భర్త తలపై కాల్చి చంపి వెళ్లిపోయాడంటూ సుజాత కన్నీటి పర్యాంతమైంది.
Also Read : ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ
పహల్గామ్ దాడి జమ్మూ కాశ్మీర్‌లో ఆరు సంవత్సరాలలో జరిగిన అత్యంత దారుణమైనది, 2019 ఫిబ్రవరిలో పుల్వామా జిల్లాలో 40 మంది సైనికులు హత్యకు గురైన తర్వాత ఇదే అత్యంత దారుణమైనది. అమాయకపు టూరిస్టులపై దాడులకు పాల్పడిన ఏ ఒక్క డగ్రవాదిని కూడా వదిలిపెట్టబోమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Also read : పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!