Nita Ambani: 50వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు–రిలయెన్స్

చిల్డ్రన్స్ డే సందర్భంగా రిలయెన్స్ పెద్ద ప్రకటన చేసింది. 50 వేల మందికి ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు చేయిస్తామని తెలిపింది. అలాగే 50,000 మంది మహిళల్లో రొమ్ము, గర్భాశయ కేన్సర్‌కు ఉచిత స్క్రీనింగ్, చికిత్స కల్పించనున్నారు.

a
New Update

Heart Operation to Kids: 

రిలయెన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ చిల్డ్రన్స్ డే సందర్భంగా కీలక ప్రకటన చేశారు. 50 వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పిల్లలు, టీనేజ్ లో
 ఉన్న బాలికలు, మహిళలకు అవసరమైన స్క్రీనింగ్‌లు, చికిత్సలకు ప్రాధాన్యతనిస్తూ కొత్త ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంభించినట్లు ప్రకటించారు. 50,000 మంది పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు ఉచిత స్క్రీనింగ్, చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే 50,000 మంది మహిళల్లో రొమ్ము, గర్భాశయ కేన్సర్‌కు ఉచిత స్క్రీనింగ్, చికిత్స అందించనున్నారు. ఇక 10,000 మంది టీనేజ్ పిల్లలకు  ఉచిత గర్భాశయ కేన్సర్ వ్యాక్సినేషన్‌ వేస్తామని ప్రకటించారు.

Also Read: TS: కులగణనతో సంక్షేమ పథకాలు తొలగించం‌‌‌‌–రేవంత్ రెడ్డి

 

#neetha-ambani #reliance #childrens-day #heart operations
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe