Haryana: భర్తను అలా పిలవడం క్రూరత్వం.. కోర్టు కీలక తీర్పు!

భర్తను భార్య హిజ్రా అని పిలవడం క్రూరత్వం కిందకే వస్తుందని హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది. తాను శారీరకంగా బలహీనంగా ఉన్నానని.. హిజ్రా అని పిలుస్తూ తన భార్య మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుందని.. విడాకులు మంజూరు చేయాలంటూ భర్త పిటిషన్ వేశారు.

haryana
New Update

High Court: భార్య భర్తల విడాకుల కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తన భర్తకు అనుకూలంగా విడాకులు ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మహిళా హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను నిన్న  పంజాబ్, హర్యానా హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తను భార్య హిజ్రా అని పిలవడం క్రూరత్వం కిందకే వస్తుందని కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Also Read :  ఓవర్లు, 344 పరుగులు.. బాబోయ్ ఇదేం స్కోరు...ఇలా కూడా ఆడతారా..

తన భార్య పోర్న్ సైట్లు చూస్తూ....

తన భార్యకు, తనకు 2017లో వివాహం జరిగిందని కోర్టుకు తెలిపాడు భర్త. తనను ఆ సైట్లు చూసి.. నీకు అంత శారీరక బలం లేదని.. నేను వేరే వాడిని పెళ్లి చేసుకుంటా లేదా ఉంచుకుంటా.. నువ్వు ఒక హిజ్రా అంటూ తనను మానసికంగా, శారీరకంగా వేధించేది అని భర్త ధర్మాసనం ముందు వాపోయాడు. తన తల్లి కూడా ఎందుకు పనికి రాని కొడుకును కన్నావు అంటూ తిట్టేది అని చెప్పాడు. గత ఆరు ఏళ్లుగా తాము దూరంగానే ఉంటున్నామని చెప్పాడు. కాగా ఆ మహిళా మాత్రం తన భర్త చేసిన ఆరోపణలు ఖండించింది. తాను పోర్న్ సైట్లు చూసినట్లు నిరూపించేందుకు తన భర్త వద్ద ఎలాంటి అధరాలు లేవు అని చెప్పింది.

Also Read :  శాంతి మార్గమే ఉత్తమం..ప్రధాని మోదీ, జిన్ పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు 

విడాకులు మంజూరు చేస్తూ...

ఇరువురు తరఫున వాదనలు విన్న ధర్మాసనం కింది కోర్టు ఇచ్చిన విడాకుల తీర్పును సమర్థించింది. భర్తను హిజ్రా అని పిలవడం, ఎందుకూ పనికిరాని వాడిని కన్నావని అత్తను తిట్టడం మానసిక హింసకు గురిచేయడమే అని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో భార్యా భర్తలు గత 6 సంవత్సరాలుగా విడిగా ఉంటున్నారని కోర్టు తెలిపింది. వారి బంధం బాగుచేయలేని స్థితిలో ఉందని  తెలిపింది. కింది కోర్టు ఇచ్చిన విడాకుల ఉత్తర్వుల్లో తప్పుపట్టడానికి ఏమీ లేదని భావిస్తున్నామని, ఆ ఉత్తర్వులను సమర్థిస్తున్నామని తీర్పు వెలువరించింది.

Also Read :  భారత్‌లోకి స్టార్‌లింక్.. అంబానీకి చెక్ పెట్టనున్న ఎలాన్‌ మస్క్‌ !

 

Also Read :  అన్నా చెల్లెళ్ళ ఆస్తి వివాదం..జగన్, షర్మిల లేఖలను బయటపెట్టిన టీడీపీ

#high-court #haryana #husband #transgender
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe