T20: ఓవర్లు, 344 పరుగులు.. బాబోయ్ ఇదేం స్కోరు...ఇలా కూడా ఆడతారా..

పొట్టి ఫార్మాట్ టీ20 క్రికెట్‌లో జింబాబ్దే ప్రపంచ రికార్డ్‌ను నెలకొల్పింది. 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు చేసేసింది. టీ20 ప్రపంచ కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నీలో భాగంగా గాంబియాపై 344/4 స్కోరు సాధించి చరిత్ర సృష్టించింది.

New Update
cric

Zimbabwe highest score in T20's: 

అతి చిన్న టీమ్ జింబాబ్వే ఈరోజు వామ్మో వార్నాయనో అనిపించింది. ఊరుపేరు లేని ఈ అనామక జట్టు టీ20 చరిత్రలో ఒక పేజీని లిఖించుకుంది. టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకూ ఎవరూ చేయనన్ని పరుగులు చేసి...అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు చేసి...ఇప్పటివరకూ ఏ జట్టుకూ లేని రికార్డ్‌ను సాధించింది. 

జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా ; 43 బంతుల్లో 7 ఫోర్లు, 15 సిక్స్‌లతో 133 పరుగులతో నాటౌట్‌గా నిలిచి వీర విహారం చేశాడు. ఈ క్రమంలోనే జింబాబ్వే తరఫున అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు కూడా సృష్టించాడు. ఇప్పటి వరకు టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన రికార్డు నేపాల్ పేరిట ఉండేది.  ఆదేశం 314 పరుగులు చేసింది. 2023 ఆసియా క్రీడల్లో  మంగోలియాపై నేపాల్ ఈ ఫీట్ సాధించింది. దాన్నే ఇప్పటివరకూ మరే దేశమూ బీట్ చేయలేకపోయింది. ఇప్పుడు జింబాబ్వే దాన్ని తలదన్నే స్కోరు చేసి పడేసింది. ఇక జింబాబ్వే బ్యాటర్లలో తడివానాశే మారుమణి  19 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62 పరుగులు, బ్రియాన్ బెన్నెట్  26 బంతుల్లో 52 పరుగులు, క్లైవ్ మండాడే 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 53 పరుగులు దంచికొట్టారు.

ఇక ఈ మ్యాచ్‌లో జింబాబ్వే అంత స్కోరు చేయడం ఒక ఎత్తైతే.. అవతలి జట్టు గాంబియాను కేవలం 54 పరుగులకే కుప్పకూల్చడం మరొక ఎత్తు. బ్యాటర్లు ఎంత అద్బుతంఆ రాణించారో బౌలర్లు అంతకంటే ఎక్కువ రెచ్చిపోయారు. 14.4 ఓవర్లలో గ54 పరుగులకే గాంబియా జట్టును పెవిలియన్ బాట పట్టించారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ 3, బ్రాండన్ మావుట 3, వెస్లీ మధ్వీర 2, ర్యాన్‌ బర్ల్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 290 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో పరుగులపరంగా ఇదే అతిపెద్ద విజయం. అంతకుముందు ఈ రికార్డు నేపాల్ 290 పరుగులు, మంగోలియాపై 2023 పేరున ఉంది. అంతర్జాతీయ మ్యాచ్‌లలో టీ20ల్లో భారత అత్యధిక స్కోరు 297/6.  

Also Read: Gold: ఆల్‌ టైమ్ గరిష్టానికి బంగారం, వెండి ధరలు

Advertisment
తాజా కథనాలు