నేడే హర్యానా, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..

నేడే హర్యానా, జమ్మూకశ్మీర్‌లో ఓట్ల లెక్కింపు జరగనుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు ఇవే. అందుకే ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

author-image
By B Aravind
Haryana - Kashmir Election Counting
New Update

హర్యానా, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న ఎన్నికల ఫలితాల రోజు వచ్చేసింది. మంగళవారమే ఈ రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరగనుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు ఇవే. అందుకే ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎగ్జిట్‌ ఫలితాలు కూడా వచ్చేశాయి. హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని దాదాపు అన్ని సర్వేలు చెప్పేశాయి. ఇక జమ్మూకశ్మీర్‌లో హంగ్ వచ్చే ఛాన్స్ ఉందని మెజార్టీ సర్వేలు అంచనా వేశాయి. 

Also Read: అప్పటిలోగా నక్సలిజం ఖతం.. కేంద్రం కొత్త వ్యూహం ఇదే!

హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పోటీపడుతుండగా.. సంయుక్తంగా జన్‌నాయక్ జనతా పార్టీ (JJP)- ఆజాద్‌ సమాజ్‌ పార్టీ (ASP), అలాగే ఇండియన్ నేషనల్ లోక్‌ దళ్ (INLD)- బహుజన్ సమాజ్ పార్టీ   (BSP) కలిసి పోటీ చేయనున్నాయి. హర్యానాలో ముఖ్యంగా కిసాన్, పహిల్వాన్, జవాన్ అంశాల ఆధారంగానే ఎన్నికలు జరిగాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో కేంద్రం తీసుకొచ్చిన మూడు రైతు చట్టాల పట్ల పంజాబ్‌తో పాటు హర్యానా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఇక కేంద్రం తీసుకొచ్చిన అగ్నివీర్‌ పథకంపై కూడా చాలా ప్రాంతాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 

అలాగే నిరుద్యోగం అంశం కూడా ఈ ఎన్నికలపై ప్రభావం చూపించనుంది. అలాగే అక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై కూడా వ్యతిరేకత వస్తోంది. దీంతో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ఎన్నికల్లో అధికారం కోల్పోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక జూలానా నియోజకవర్గం నుంచి రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఎలాంటి ప్రభావం చూపించనుందో అనేదానిపై ఆసక్తి నెలకొంది. 

Also Read: కెనడాలో వెయిటర్‌ ఉద్యోగం కోసం ఎగబడుతున్న వేల మంది భారతీయులు!

ఇక జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీలు ఇవే. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అక్కడ హంగ్ వచ్చే ఛాన్స్ ఉందని మెజార్టీ సర్వేలు అంచనా వేశాయి. మరికొన్ని సర్వేలు.. నేషనల్ కాన్ఫరెన్స్ - కాంగ్రెస్ కలిసి ఎక్కువ సీట్లు సాధించే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. అలాగే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) పెద్ద పార్టీగా అవతరించే ఛాన్స్ ఉందని కూడా అంచనా వేశాయి.   

#telugu-news #national-news #jammu-and-kashmir #haryana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe