/rtv/media/media_files/2026/02/11/hardeep-puri-2026-02-11-21-37-21.jpg)
Hardeep Puri Refutes Rahul Gandhi's Charge
ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం ప్రపంచదేశాలను కుదిపేస్తోంది. తాజాగా దీనికి సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు కూడా ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బయటపడటం కలకలం రేపుతోంది. విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. అమెరికా న్యాయ శాఖ దీనికి సంబంధించి ఈమెయిల్స్ విడుదల చేసింది. దీని ప్రకారం హర్దీప్ సింగ్‌కు 2014 నుంచి 2017 వరకు ఎప్‌స్టీన్‌తో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: బంగ్లాదేశ్‌లో రేపే ఎన్నికలు.. గెలిచేది ఆ పార్టీయే !
డిజిటల్ ఇండియా, భారత ఇంటర్నెట్ రంగంలో పెట్టుబడులపై చర్చలు, లింక్డ్ ఇన్ కో ఫౌండర్ రీడ్ హాఫ్‌మాన్‌తో కూడా పరిచయాల కోసం ప్రయత్నించినట్లు ఈ ఫైల్స్‌లో ఉన్నట్లు పలు ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు వెల్లడించాయి. న్యూయార్క్‌లో ఉన్న ఎప్‌స్టీన్ ఇంట్లో హర్దీప్ సింగ్ మూడుసార్లు భేటీ అయినట్లు డాక్యుమెంట్ పత్రాలు సూచిస్తున్నాయి. ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో తన పేరు బయటికి రావడంపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ స్పందించారు.
Also Read: 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ కొనుగోలు చేసిన ఎప్‌స్టీన్.. కారణం ఇదే !
తమ సమావేశాలు పరిమితమైనవని.. అవన్నీ కూడా పని ఆధారంగానే జరిగినట్లు పేర్కొన్నారు. ఎప్‌స్టీన్‌కు సంబంధించిన నేర చరిత్ర గురించి ఆ సమయంలో తనకు అవగాహన లేదని పేర్కొన్నారు. తాను మోదీ ప్రభుత్వంలో చేరకముందే ఈ సమావేశాలు జరిగినట్లు చెప్పారు. మరోవైపు దీనిపై కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రమంత్రితో ఎప్‌స్టీన్‌కు ఉన్న సంబంధాలపై పూర్తిగా వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.
Follow Us