/rtv/media/media_files/2025/03/11/QtYXPuCBa6SCKeUBLjkZ.jpg)
Ranya Rao
కన్నడ నటి రన్యారావుకు బిగ్‌షాక్ తగిలింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యారావుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ బెంగళూరు కోర్టు తీర్పు వెలువరించింది. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో రన్యారావుతో పాటుగా మరో ఇద్దరు నిందితులైన తరుణ్ కొండారు రాజు, సాహిల్‌లకు కూడా ఇదే శిక్ష విధించినట్లు బోర్డు తెలిపింది. అంతేకాకుండా శిక్షా కాలంలో బెయిల్ కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం లేదంది. ఈ కేసు గురించి ప్రతి మూడు నెలలకొసారి విచారణలు జరుగుతాయని కోర్టు స్పష్టం చేసింది.
Also read : Jammalamadugu : చంపింది అన్నేనా.. గండికోట యువతి మర్డర్ మిస్టరీలో బిగ్ అప్డేట్!
Also Read : BIG BREAKING: వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్.. మళ్లీ అరెస్ట్?
🚨 Actress Ranya Rao sentenced to 1 year in jail for gold smuggling!
— Tirish Reddy (@tirishreddy) July 17, 2025
She was caught red-handed smuggling gold from Dubai.
🔸 14.7 kg gold seized
🔸 ED recently attached properties worth ₹34.12 Cr in Bengaluru#RanyaRao#GoldSmuggling#ED#CrimeNews#IndiaNewspic.twitter.com/j2uYFNE0gm
బెంగళూరు ఎయిర్‌పోర్టులో రెడ్ హ్యాండెడ్‌గా
దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ బెంగళూరు ఎయిర్‌పోర్టులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది రన్యారావు. రన్యారావు నుంచి 14.7 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక ఈ కేసు విచారణ సమయంలో ఆమె నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేసి రూ.34.12 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు.
Also Read : Amberpet: మతాంతర వివాహం చేసుకుని.. ఉరేసుకుని నవదంపతులు ఆత్మహత్య
Also read : Gangraped : కారులో మహిళపై ఏడుగురు గ్యాంగ్ రేప్..11 రోజుల పాటు ఒకరి తరువాత మరోకరు!