/rtv/media/media_files/2025/04/22/iYJ3suUVDNBeOj8IyWBe.jpg)
Gold Rate Record Hike
Gold Price : లక్ష..దాటుతుంది..లక్ష దాటుతుంది అని ఇన్నాళ్లు అందరూ ఎదైతే అనుకున్నారో అదే జరిగింది, తులం (10 గ్రాములు) బంగారం ధర అక్షరాలా లక్ష రూపాయలకు చేరింది. దీంతో సామాన్యుడు బంగారం కొనడం కాదు పేరు వింటేనే భయపడిపోయే పరిస్థితి వచ్చేసింది.అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల కారణంగా బంగారానికి రెక్కలొచ్చాయి. బంగారంపై పెట్టుబడే సురక్షితమని అందరూ నమ్ముతుండటంతో ఇటీవల కాలంలో బంగారం ధరలు అమాంతం పెరిగాయి. ఇలా రోజురోజుకు పెరుగుతూవచ్చిన గోల్డ్ ఇవాళ ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంది. సోమవారం సాయంత్రానికి 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,016 కు చేరుకుంది. దేశంలో ఒక్కో నగరంలో ఒక్కోలా బంగారం ధరలు ఉంటాయి... కొన్ని నగరాల్లో ఇప్పటికే తులం బంగారం లక్షకు చేరితే మరికొన్నినగరాల్లో త్వరలోనే ఈ మార్క్ దాటే అవకాశం ఉంది.
అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాముల) మేలిమి (24 క్యారెట్ల) బంగారం ధర సోమవారం తొలిసారిగా 3,400 డాలర్ల మార్కును అధిగమించింది. ఒక్క రోజులోనే ఔన్సు బంగారం ధర 110 డాలర్లు పెరిగి 3,424 డాలర్లకు, ఔన్సు వెండి ధర 33 డాలర్లకు చేరాయి. అమెరికా డాలర్ విలువ రూ.85.15 వద్ద ఉంది. ఫలితంగా దేశీయ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర తొలిసారిగా రూ.1 లక్షను అధిగమించింది. రాత్రి 11.30 గంటల సమయానికి అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 3,413 డాలర్లు, ఔన్సు వెండి ధర 32.6 డాలర్ల వద్ద ఉండగా, హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,00,015 వద్ద, కిలో వెండి ధర రూ.98,200 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
Also Read: Watch Video: కన్నడ మాట్లాడలేదని ఐఏఎఫ్ అధికారిపై దాడి.. వీడియోలో రక్తంతో..
మరింత పెరిగే అవకాశం
అయితే లక్ష రూపాయలతో బంగారం ధర ఆగిపోదని... మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది... కాబట్టి బంగారానికి అధిక డిమాండ్ ఉంది. ధర ఎంత పెరిగినా బంగారం కొనేవారు మాత్రం తగ్గడంలేదు. అలాగే అక్షయ తృతీయ దగ్గర పడుతోంది. ఈరోజు కనీసం గ్రాము బంగారమైనా కొనాలని చాలామంది నమ్ముతారు. ఇలా బంగారం కొనుగోళ్లకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు కాబట్టి ధర మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగారం ధర ఇదే స్థాయిలో పెరుగుతూ పోతుంటే తులం ధర రూ.1,30,000 ఈ ఏడాదిలోనే చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం తులం బంగారం అంటేనే నోరెళ్లబెడుతున్న సామాన్యులు ఏడాది చివర్లో బంగారం ధరను చూసి ఎలా రియాక్ట్ అవుతారో. మొత్తంగా బంగారం అనేది ధనవంతుల వస్తువుగా మారిపోతోంది... పేదవాడు ఆ పేరు ఎత్తే పరిస్థితులు మెళ్లిగా దూరమవుతున్నాయి.
Also Read: మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్
ఈ ఏడాదే రూ.21,000కు పైగా పెరిగిన బంగారం
ఈ ఏడాదిలో మేలిమిబంగారం 10 గ్రాములు రూ.21,000కు (26%) పైగా పెరిగింది. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్- పాలస్తీనా, ఇజ్రాయెల్- హెజ్‌బొల్లా (లెబనాన్) మధ్య యుద్ధం, చైనాపై అమెరికా భారీ టారిఫ్‌లు, ఆంక్షల నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో ఔన్సు బంగారం ధర 3,000 డాలర్లను మించింది. రూపాయితో పోలిస్తే, డాలర్ విలువ దాదాపు స్థిరంగా ఉన్నా.. మరికొన్ని ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే బలహీనపడుతోంది. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గి, డాలర్ బలహీనపడే అవకాశాలున్నందునే, సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తూ బంగారంపైకి పెట్టుబడులను అంతర్జాతీయ పెట్టుబడిదారులు మళ్లిస్తున్నారని చెబుతున్నారు. ఇవన్నీ కలిసి బంగారం ధర పెరిగేందుకు కారణమవుతోంది.
ఈ నాలుగు నెలల్లోనే ...
ఈ ఏడాది ఆరంభంలో తులం బంగారం ధర రూ.80 వేలు ఉంది... కానీ ఈ మూడునాలుగు నెలల్లోనే లక్ష రూపాయలకు చేరుకుంది. అంటే అతి తక్కువ సమయంలో ఏకంగా రూ.20 వేలు పెరిగింది... అంటే ఇది 26 శాతం పెరుగుదల. మొత్తంగా గత ఐదేళ్లలో బంగారం ధరం 110 శాతం కంటే ఎక్కువగానే పెరిగింది. నాలుగేళ్ల కింద అంటే 2020 లో తులం బంగారం ధర కేవలం 45 వేలే. అక్కడినుండి జెట్ స్పీడ్ తో పెరిగిన బంగారం ధర ఇప్పుడు లక్షకు చేరింది. అంతర్జాతీయ స్థాయిలో అలజడి తగ్గేవరకు బంగారం ధర ఇలాగే పెరుగుతుందని అంటున్నారు. అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్ బంగారం ధరపై భారీ ప్రభావం చూపిస్తోంది.
Also Read: Zelensky: చెప్పుకోవడానికే కాల్పుల విరమణ..దాడులు మాత్రం ఆగడం లేదు!
కేవలం బంగారమే కాదు వెండి ధర కూడా చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుతం కిలో వెండి కూడా రూ.99 వేలకు పైగా ధర పలుకుతోంది. అంటే ఇదికూడా రేపో మాపో లక్ష రూపాయల మార్కును దాటవచ్చు. ఇలా బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డు ధరకు చేరుకుని సామాన్యులకు దూరంగా వెళుతున్నాయి. డబ్బులు బడాబాబులు తప్ప సామాన్యులు బంగారంవైపు కన్నెత్తిచూసే పరిస్థితులు లేవు.
fall in gold prices | gold price analysis | gold price india | rising gold prices | gold price today news