/rtv/media/media_files/2025/12/29/2025-2025-12-29-20-11-16.jpg)
2025 ఏడాది ఇండియాకు చాలా ముఖ్యమైన ఏడాది. భారత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మూడోసారి ఢంకా మోగించింది. థర్డ్ టైమ్ ప్రభుత్వాన్ని నెలకొల్పి మోదీ రికార్డ్ సాధించారు. దాంతో పాటూ ఎన్నో ముఖ్యమైన సంఘటనలకు నెలవైంది ఇండియా. ఆనందాలతో పాటూ విషాదాలు చోటు చేసుకున్నాయి. వాటినన్నింటినీ ఒకసారి తలుచుకుంటే...
ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో బీజేపీ జోరు..
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ తన ప్రస్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంటూ వచ్చింది. ఇంతకు ముందు అధికారంలో లేని చోట్ల కూడా గెలిచి తన సత్తా చాటుకుంది. ముఖ్యంగా ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. ఢిల్లీలో 70 సీట్లలో 48 గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇక బీహార్ లో అయితే ఎన్డీయే 243కు గానూ 202 స్థానాలు గెలుచుకుంది. నితీశ్ కుమార్ 10వ సారి ముఖ్యమంత్రి అయి రికార్డ్ నెలకొల్పారు.
మహా కుంభమేళా..
ఏడాది మొదట్లోనే జరిగిన కుంభమేళా చరిత్ర సృష్టించడంతో పాటూ తీవ్ర విషాదాన్ని కూడా మిగుల్చింది. లక్షలాది మంది ప్రజలు ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు తరలి వచ్చారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీని ఏర్పాటలను అద్భుతంగా చేసింది. విదేశాల నుంచి కూడా అతిథులు ఈ కుంభమేళాకు హాజరయ్యారు. కానీ జన సమూహం ఎక్కువై తొక్కిసలాట అయింది. దీంతో డజన్ల కొద్దీ మరణాలు సంభవించాయి. మొత్తం 30 మంది ఈ ఘటనలో మృతి చెందారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. మౌని అమావాస్య నాడు, అమృత స్నానం కోసం త్రివేణి సంగమం వద్ద భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. జాతర ప్రాంతం, అఖాడాల బారికేడ్లు విరిగిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట..
2025 ఫిబ్రవరి 15న న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో అతి పెద్ద తొక్కిసలాట జరిగింది. కుంభమేళా కోసం జనం భారీగా రావడంతో ఫ్లాట్ ఫామ్ లు కిక్కిరిసిపోయాయి. అదే సమయంలో ప్రగాజ్ రాజ్ కు వెళ్ళాల్సిన ట్రైన్ రావడంతో జనం మధ్యలో తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది మరణించారు.
పహల్గాందాడి..ఆపరేషన్ సింధూర్
భారత్ లో సంభవించిన అత్యంత విషాదాల్లో ఇది ముఖ్యమైనది. ప్రపంచాననే కుదిపేసిన సంఘటన. ఏప్రిల్ 22న, జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో 26 మంది ప్రణాలు కోల్పోయారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఈ చర్యకు పాల్పడ్డారు. ఇందుకు ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఐదు రోజుల పాటూ తీవ్ర యుద్ధం జరిగింది. దీంతో పాకిస్తాన్ తో మనకున్న సంబధాలననీ కటీఫ్ అయిపోయాయి. అప్పటి నుంచి రెండు దేశాల మధ్యా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా క్రాష్..
జూన్ 12న, అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం 171 కూలిపోయింది. ఈ ఘటనలో ఫ్లైట్ లో ఉన్నవారందరూ మరణించారు. ప్రయాణికులతో పాటూ సిబ్బందితో సహా 241 మంది చనిపోయారు. దాతో పాటూ విమానం ఒక అహ్మదాబాద్ లోని మెడికల్ కాలేజ్ హాస్టల్ పై కూలిపోవడంతో అందులో ఉన్న డాక్టర్ విద్యార్థులు 19 మంది సైతం ప్రాణాలు పోగొట్టుకున్నారు.
కరూర్, బెంగళూరు ర్యాలీ తొక్కిసలాటలు..
17 ఏళ్ళ నిరీక్షణ తర్వాత మొట్ట మొదటిసారి ఆర్సీబీఐపీఎల్ కప్ ను గెలుచుకుంది. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలబడలేదు. టోర్నీ గెలిచాక ఆర్సీబీ బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. బెంగళూరులో జరిగిన ఆర్సీబీ పరేడ్ విషాదంగా ముగిసింది. చిన్న స్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. 52 మందికి గాయాలయ్యాయి. 18 ఏళ్ల తరువాత ఆర్సీబీ కప్ గెలవడంతో భారీ సంఖ్యలో అభిమానులు చిన్నస్వామి స్టేడియానికి వచ్చారు. స్టేడియం సామర్థ్యం కన్నా ఎక్కువ మంది జనాలు రావడం వల్లనే ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఇదంతా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోనే జరిగింది.
తమిళనాడు నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ థళపతి ‘తమిళగ వెట్రి కళగం’ కొత్త పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 27వ తేదీన కరూర్ జిల్లాలో రాజకీయ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఘోరమైన తొక్కిసలాట ఘటన జరిగింది. అధిక జనభా రావడంతో పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో 41 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
ఎర్రకోట బాంబు పేలుడు..
ఢిల్లీ ఉగ్రదాడితో మొత్తం దేశం అంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. ఎర్రకోట దగ్గరలో పేలిన బాంబు దాడిలో ఇప్పటి వరకు 13 మంది చనిపోయారు. మరో 20 మంది తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ బాంబు దాడి వెనుక ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ హస్తం ఉన్నట్లు తెలిసింది. దీని వెనుక ఉన్న ఉగ్రవాదులు దాదాపు 20 మంది ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. చాలా రోజుల నుంచే దీని కోసం ప్లాన్ చేశారని తెలిసింది. ఈ బాంబు దాడులపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. బాంబు దాడికి పాల్పడిన ఉమర్ నబీ దాడిలోనే మరణించాడు.
ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్..
ఈ ఏడాది ఎప్పుడూ లేనంతగా ఢిల్లీలో గాలిలో నాణ్యత క్షీణించింది. నాలుగు నెలలుగా అక్కడి ప్రజలు ఎయిర్ పొల్యూషన్ తో నరకం చూస్తున్నారు. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ 400 కు వచ్చేసింది. ప్రతీ ఏడాది ఇది 300 దగ్గర ఆగిపోయేది. కానీ ఈ సారి దాన్ని దాటుకుని వచ్చేసి AQI 404 కు దిగజారిపోయేది. దీన్ని అత్యంత తీవ్ర పరిస్థితిగా పరిగణిస్తారు. దీని కారణంగా చాలా మంది అనారోగ్యాల బారిన పడ్డారు.
ఇండిగో సంక్షోభం..
భారతదేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్ అయిన ఇండిగో డిసెంబర్ 2025లో భారీ షెడ్యూల్ సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీని కారణంగా వేలాది విమానాలు రద్దు అయ్యాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో లక్షల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. గందరగోళం నెలకొంది. దాదాపు ఐదు నోజుల పాటూ ప్రయాణికులు నానాపాట్లు పడ్డారు. ఇటీవల డీజీసీఏ FDTL నిబంధనలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. పైలట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతిని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచింది. నవంబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అలాగే రాత్రి సమయాల్లో ల్యాండింగ్స్‌ను పరిమితం చేసింది. ఇవన్నీ నవంబర్ నుంచే అమల్లోకి వచ్చాయి. మిగతా విమానయాన సంస్థలన్నీ కొత్త రూల్స్ ప్రకారం అన్ని సర్వుబాట్లు చేసుకున్నాయి. తమ విమానాల డ్యూటీ పరిమితుల నిబంధనలకు అనుగుణంగా మార్చుకున్నాయి. కానీ ఇండిగో సంస్థ మాత్రం నిర్లక్ష్యం చేసింది. దీంతో ఒక్కసారిగా ప్రాబ్లెమ్ పెద్దగా అయింది.
Follow Us