Delhi Spice Jet: కాక్ పిట్ లోకి ఇద్దరు మహిళలు చొరబాటు..ఫ్లైట్ 7 గంటలు ఆలస్యం

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. మంబై వెళుతున్న స్పైప్ జెట్ విమానంలో ఇద్దరు మహిళలు కాక్ పిట్ లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. దీంతో విమానాన్ని నిలిపేశారు. ఈ కారణంగా ఫ్లైట్ ఏడు గంటలు ఆలస్యం అయింది.

New Update
Spicejet Flight

Spicejet Flight

దేశ రాజధాని ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళే విమానంలో ఇద్దరు మహిళా ప్రయాణికులు హల్ చల్ చేశారు. స్పైస్‌ జెట్‌ విమానం మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీ నుంచి ముంబయి వెళ్లాల్సి ఉంది. టేకాఫ్ కు సిద్ధమైంది. అదే సమయంలో ఫ్లైట్ లో ఉన్న ఇద్దరు మహిళలు వింతగా ప్రవర్తించారు. తమ సీట్లలో నుంచి లేచి గొడవ గొడవ చేశారు. సిబ్బందితో వాదులాడారు. ఎంత అడ్డుకుంటున్నా వినిపించుకోకుండా కాక్ పిట్ లోకి చొరబడ్డానికి ప్రయత్నించారు. తోటి ప్రయాణికులు చెబుతున్నా వినిపించుకోలేదు. దీంతో విమానాన్ని ఉన్న చోటనే నిలిపేశారు. తరువాత ఇద్దరు మహిళలను దించేసి సీఐఎస్ఎఫ్‌కు అప్పగించారు.

వరుసపెట్టి సాంకేతిక సమస్యలు..

ఈ ఘటన కారణంగా ముంబై వెళ్ళాల్సిన స్పైస్ జెట్ విమానం ఏడు గంటలు ఆలస్యం అయింది. మధ్యాహ్నం 12.30 గంటలకు వెళ్లాల్సిన ఈ విమానం రాత్రి 7.31 గంటలకు ముంబయికి టేకాఫ్‌ అయ్యింది. అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ తర్వాత విమానాలకు సంబంధించి రోజూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. అంతకు ముందు జూన్‌ 13న మరో స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతిక సమస్య ఎదురైంది. ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరిన విమానం రన్ వే దగ్గర పడిపోయింది. దీంతో విమానం సిబ్బంది ఒకరు కింద కూడా పడిపోయారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు