/rtv/media/media_files/2025/10/17/rape-2025-10-17-14-41-29.jpg)
Father rapes daughter
Mumbai Rape case: సమాజంలో రోజురోజుకు బంధాలు, అనుబంధాలకు చోటు లేకుండా పోతుంది. వావివరుసలు మరిచి కంటిపాపనే కాటేసే పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్రలో అలాంటి సంఘటనే తీవ్ర కలకలం రేపింది. 20 ఏళ్ల ఓ బధిర యువతి గర్భం దాల్చింది. అయితే తను అత్యాచారానికి గురైన విషయం కూడా ఆమెకు తెలియదు. ఈ విషయంలో పోలీసులు నేరస్తుడు ఎవరో తేల్చే పనిలో పడ్డారు. దీనికోసం డీఎన్‌ఏ పరీక్ష సైతం చేయించాల్స వచ్చింది. అయితే ఆ పరీక్షలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
ఈ అమానవీయ ఘటన గతేడాదే చోటుచేసుకుంది.. కేసును విచారించిన పోలీసులకు సంచలన విషయాలు బయటకు రావడంతో అంతా అవక్కాయ్యారు. వివరాల ప్రకారం ముంబయికి చెందిన 20 ఏళ్ల యువతి గతేడాది సెప్టెంబర్‌లో అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె బాగోగులు చూస్తున్న నాన్నమ్మ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యుల గర్భం దాల్చిందని వైద్యులు గుర్తించారు. ఆ యువతికి ఐదోనెల అని వెల్లడించడంతో ఆ వృద్దురాలు కన్నీటి పర్యంతమైంది. వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆమె బధిరురాలు కావడం, తనపై జరిగిన అత్యాచారం విషయం చెప్పడానికి ఇష్టపడకపోవడంతో తొలుత పోలీసులు వాంగ్మూలాన్ని నమోదు చేయలేకపోయారు. దాంతో వారు బాధితురాలి తండ్రితో మాట్లాడారు. ఈ విషయంలో స్పందిచిన ఆయన ఆమె ఎలా గర్భం దాల్చిందో తనకు తెలియదని బుకాయించడమే కాకుండా ఫిర్యాదు చేసేందుకు నిరాకరించాడు.
దీంతో పోలీసులకు మరింత అనుమానం వచ్చింది. పోలీసులు ఆమెకు మానసికంగా కౌన్సిలింగ్ చేయడంతో.. ఫిర్యాదు చేసేందుకు అంగీకరించింది. దర్యాప్తులో భాగంగా అనుమానం ఉన్న17 మందికి డీఎన్‌ఏ టెస్ట్ చేయించారు. ఆ అనుమానితుల్లో కన్నతండ్రి కూడా ఉన్నాడు. అయితే ఇటీవల డీఎన్‌ఏకు సంబంధించిన ఫలితాలు వచ్చాయి అవి చూసి, పోలీసులు విస్తుపోయారు. పిండం డీఎన్‌ఏ, ఆమె తండ్రి డీఎన్‌ఏతో మ్యాచ్ అయింది. దాంతో ఆమె తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ అత్యాచారం కేసులో గతంలో ఓ టీనేజర్‌ని కూడా అరెస్టు చేశారు. బాధితురాలు అతడిని గుర్తించడంతో ఆ అరెస్టు జరిగింది. వారితో పాటు మిగిలిన వారి పాత్ర పైనా దర్యాప్తు జరుగుతోంది.
Follow Us