మరికొద్ది సేపట్లో జమ్మూకశ్మీర్ , హర్యానా ఎన్నికల ఫలితాలు.. ప్రజల తీర్పుపై ఉత్కంఠ! దేశంలో అందరి చూపూ జమ్మూ కశ్మీర్ , హర్యానా ఎన్నికల ఫలితాలపైనే ఉంది. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. మరోవైపు హర్యానా అసెంబ్లీకి ఈ నెల 5న ఎన్నికల ముగిసాయి. By Bhavana 08 Oct 2024 in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి Jammu Kasmir: నేడు యావత్ దేశం చూపు మొత్తం జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాల మీదే ఉంటుంది. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దయిన తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆ తరువాత లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత డీ లిమిటేషన్ తర్వాత మొత్తంగా 90 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతలుగా ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించింది. గతంలో కంటే ప్రజలందరూ స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి ముందుకొచ్చారు. Also Read: కాంగ్రెస్ పునరుజ్జీవం..హర్యానాలో ఓట్లన్నీ అటేనా? అటు జమ్మూ కశ్మీర్ తో పాటు ఇటు హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జమ్మూ కశ్మీర్ లో మూడు విడుతల్లో ఎన్నికలను అధికారులు నిర్వహించారు. హర్యానాలో ఒకే విడతలో ఈ నెల 5న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కూటమిలు తమ అస్త్ర శస్త్రాల యుక్తులతో రంగంలోకి దిగాయి. Also Read: దేశంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందా..పార్టీ పునర్వైభవం సాధిస్తుందా? హర్యానా.. హర్యానాలో మొత్తంగా 90 శాసన సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఒకే దశలో ఇక్కడ పోలీంగ్ జరిగింది. గత రెండు పర్యాయాలు ఇక్కడ అధికారం అనుభవించిన బీజేపీకి ఇక్కడ భారీ ఎదురు దెబ్బ తగిలేందుకు సిద్దంగా ఉన్నట్లు పలు సర్వేలు చెప్పకనే చెప్పాయి. వారి అంచనాలు నిజమై.. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తుందా అనేది వేచి చూడాల్సిందే. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ సగానికి సగం కోల్పోయింది. ముఖ్యంగా రైతుల పేరిట జరిగిన కొన్ని ఉద్యమాలు.. రెజ్లర్ ఉద్యమాలు బీజేపీకి ఇక్కడ కోలుకోలేని ఎదురుదెబ్బ వేసినట్లు తెలుస్తుంది. మరి ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో మరికొద్ది సేపటిలో తెలియనుంది. జమ్మూ కశ్మీర్.. జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం అయిన తర్వాత ఇక్కడ ఎన్నికలు జరిగాయి. దాదాపు దశాబ్ద కాలం తర్వాత జమ్మూ కశ్మీర్ శాసనసభకు ఎలక్షన్స్ జరిగాయి. అంతేకాకుండా మూడు దశల్లో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. మోదీ సర్కారు ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ముఖ్యంగా జమ్మూ రీజియన్ లో బీజేపీ పనితనం బాగున్నట్టు పలు సర్వే సంస్థలు చెప్పాయి. మరోవైపు కశ్మీర్ లోయలో పీడీపీ, కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్టు గెలిచే అవకాశాలున్నట్టు సమాచారం. జమ్ము కశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన నెంబర్ 46. మరోవైపు 2014 లో అక్కడ ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో బీజేపీ, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. Also Read: రాష్ట్ర పరిణామాలు ప్రధానికి వివరించా– సీఎం చంద్రబాబు తాజాగా జరిగిన ఎన్నికల్లో అవి రెండు కూడా ఉప్పు, నిప్పుగా తలబడ్డాయి. రెండు పార్టీలు వేర్వేరుగా ఎన్నికల బరిలోకి దిగాయి. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీ పొత్తులు పెట్టుకుని బరిలోకి దిగాయి. ఈ క్రమంలో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో మరికాసేపట్లో తెలనుంది. Also Read: జమ్మూ–కాశ్మీర్‌లో మళ్ళీ హంగ్ తప్పదా..మరికాసేట్లో తేలనున్న భవితవ్యం మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి