హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో పాల్గొననున్న భారత్, పాక్ జట్లు

హంకాంగ్ వేదికగా నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు జరగనున్న హాంకాంగ్‌ సిక్స్‌ల క్రికెట్‌ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు పాల్గొననున్నాయి. ఈ విషయాన్ని హాంకాంగ్ చైనా అధికారిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

New Update
India and Pak

హంకాంగ్ వేదికగా నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు జరగనున్న హాంకాంగ్‌ సిక్స్‌ల క్రికెట్‌ (Hong Kong Cricket Sixes tournament) టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు పాల్గొననున్నాయి. ఈ విషయాన్ని హాంకాంగ్ చైనా అధికారిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్ అనేది ప్రతిష్ఠాత్నకమైన అంతర్జాతీయ టోర్నమెంట్. ఈ టోర్నీని 1992లో ప్రారంభించారు. 2005లో చివరిసారిగా భారత్‌ ఈ టోర్నీలో పాల్గొంది. టీమిండియా తరపున సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని వంటి స్టార్ ప్లేయర్లు ప్రాతినిధ్యం వహించారు. కొన్నే్ళ్లుగా జరుగుతున్న ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లండ్ అత్యంత విజయవంతమైన జట్లుగా కొనసాగుతున్నాయి. 

Also read: రేపే హర్యానా, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..

 మూడు రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు తలపడనున్నాయి. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మ్యాచ్‌లు జరుగుతాయి. మ్యాచ్‌లన్నూ కూడా హాంకాంగ్‌లోని టిన్‌ క్వాంగ్‌ రోడ్‌ క్రికెట్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు. ఇక పాకిస్థాన్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. పాక్ జట్టుకు ఆల్‌ రౌండర్‌ షహీమ్‌ అష్రఫ్ నాయకత్వం వహించనున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు