దేశంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందా..పార్టీ పునర్వైభవం సాధిస్తుందా? మరికాసేట్లో హర్యానా, జమ్మూ–కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు విడుదల అవనున్నాయి. వీటికి సంబంధించి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. వాటిని బట్టి చూస్తే రెండు చోట్లా కాంగ్రెస్సే వస్తుందని ఉంది. దీంతో దేశంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందని తెలుస్తోంది. By Manogna alamuru 08 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Congress Regain: పదేళ్లుగా కాంగ్రెస్ పోగొట్టుకున్న అధికారం, పొలిటికల్ ఇంపార్టెన్స్ ఇప్పుడు పెంచుకుంటోందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. దీనికి రీసెంట్‌గా జరిగిన ఎన్నికలు, ఇప్పుడు పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నామ రూపాల్లేకుండా పోయింది. ఆ పార్టీ ఉందంటే ఉంది లేదంటే లేదనే పరిస్థితి ఎదుర్కొంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. సరైన నాయకులు లేక...పార్టీ నడిపించే లీడ్ మైనస్‌తో చాల ఇబ్బందులు ఎదుర్కొంది.కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలను చాలా మేర తన చేతుల్లోకి తీసుకున్నారు. ప్రజల్లోకి వెళ్ళారు. భారత్ జోడో అంటూ దేశం మొత్తం తిరిగారు. ఇది చాలా వరకు కాంగ్రెస్‌కు హెల్ప్ అయింది. దాని ప్రభావం ప్రజల్లో బాగానే పడింది. దాని ఫలితమే దేశంలో రీసెంట్‌గా జరిగిన ఎన్నికలు. ఐదు నెలల క్రితం చాలా చోట్ల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఇందులో ఫైనల్‌గా బీజేపీనే గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించింది. కానీ నిజానికి బీజేపీకి మెజార్టీ రాలేదు. మిత్ర పక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాంతో పాటూ అయోధ్య లాంటి చోట బీజేపీ ఓడిపోయింది. మరోవైపు కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకుంది. ప్రతిపక్షం ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీని పెంపొందించుకోవడమే కాకుండా...ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కూడా బలంగా నిలబడింది. దాంతో పాటూ కర్ణాటక, తెలంగాణ లాంటి బలమైన రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. తమిళనాడు, జార్ఖండ్ లాంటి మరికొన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమిలోని పార్టీలే ప్రభుత్వాలను నడిపిస్తున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్‌కు మరింత బలాన్నిస్తున్నాయి. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ఇదంతా నాలుగు నెలల కింద జరిగిన రాజకీయ పరిణామాలు. ఇప్పుడు తాజాగా దేశంలో మరింత పలిటికల్ హీట్ పెరిగింది. దానికి కారణం హర్యానా, జమ్మూ–కాశ్మీర్ ఎన్నికలు. నాలుగు రోజల క్రితమే రెండు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. అదే రోజున ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ విడుదల అయ్యాయి. ఇప్పుడు మరికాసేపట్లో అసలు కౌంటింగ్ మొదలవనుంది. ఈరోజు సాయంత్రానికి మొత్తం ఫలితాలు కూడా వచ్చేస్తాయి. అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే...రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల మీద నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేల్లో...రెండు చోట్లా కాంగ్రెస్సే వస్తుందని తేలింది. హర్యానాలో డౌట్ లేకుండా కాంగ్రెస్సే వస్తుందని ఢంకా బజాయించి చెపితే..జమ్మూ–కాశ్మీర్‌లో హస్తం పార్టీ ఆధిక్యంలో ఉంటుంది కానీ హంగ్ ఏర్పడవచ్చని చెబుతున్నాయి. దీంతో అసలు రిజల్ట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో తమ ముద్ర వేసి వేళ్ళూనుకుంటున్న కాంగ్రెస్...ఇప్పుడు హర్యానా, జమ్మూ–కాశ్మీర్ రెండింటిలో కనుక గెలిస్తే...తిరుగులేని పార్టీగా తయారవుతుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి గట్టి ప్రతిక్షంగా తారవుతుంది. దీంతో బీజేపీ ఏకపక్షంగా ఏ నిర్ణయం తీసుఓవడం అవదు. పదేళ్ళుగా ఏకపక్షంగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు కనుక హస్తం పార్టీకి అనుకూలంగా వస్తే మాత్రం మరింత కష్టాలను ఎదుర్కొనక తప్పదు. ఇది ప్రధాని మోదీకి కానీ, బీజేపీకి కానీ అంత రుచించే విషయం కాదు. Also Read: AP: రాష్ట్ర పరిణామాలు ప్రధానికి వివరించా– సీఎం చంద్రబాబు మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి