జమ్మూ–కాశ్మీర్‌లో మళ్ళీ హంగ్ తప్పదా..మరికాసేట్లో తేలనున్న భవితవ్యం ఆర్టికల్ 370ను రద్దు చేయడం, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంతో ఇక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీని తరువాత ఇప్పుడు ఎన్నికలు జరిగాయి. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ ఎన్నికల ఫలితాల మీదనే ఉంది. By Manogna alamuru 07 Oct 2024 | నవీకరించబడింది పై 08 Oct 2024 06:37 IST in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Jammu-Kashmir Election Results: జమ్మూ కాశ్మీర్ అనగానే ఉగ్రవాదుల హింసాకాండ, ఎన్ కౌంటర్లు, కాల్పులు, బాంబు దాడులు, చొరబాట్లు, సీమాంతర ఉగ్రవాదం గుర్తుకు వస్తాయి. అటువంటి రాష్ట్రంలో పదేళ్ల తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అది కూడా ఆర్టికల్ 370 రద్దు తర్వాత. దీంతో ఈ ఎన్నికలకు అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది. ఇక్కడ కుర్చీ కోసం బీజేపీతో పాటూ కాంగ్రెస్ కూడా తెగ ప్రయత్నించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ తెగ అభివృద్ధిచెందిపోతుందని...ఇక్కడ యవకు ఉద్యోగాలు రెక్కలు కట్టుకుంటూ వచ్చేస్తాయని బీజేపీ ప్రభుత్వం నమ్మబలికింది. మరి గ్రౌండ్ రిపోర్ట్ అలానే ఉందా అంటే కచ్చితంగా లేదనే సమాధాన వినిపిస్తోంది. లు సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం బీజేపీ చెప్పినట్టు జమ్మూ–కశ్మీర్‌లో మ్యాజిక్ ఏ జరిగిపోలేదు. ఇంతకు ముందు కన్నా పరిస్థితులు కొంచెం బాగుపడ్డాయి తప్పితే పెద్దగా ఏం కనిపించడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందా లేదా అనేది తెలియడం లేదు. ఇక మరోవైపు రాష్ట్ర హోదా అనే అంశంతో జమ్మూ–కాశ్మీర్ లో కాంగ్రెస్ ప్రచారాన్‌ని నిర్వహించింది. దాంతో పాటూ లోకల్ పార్టీ ఎన్సీపీతో కలిపి జట్టుగా దిగింది. ఇది కాంగ్రెస్‌కు లాభిస్తుందా? కశ్మీర్, లడఖ్ ప్రజలు తమ ప్రజాస్వామ్య హక్కులను తిరిగి పొందాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. దేశంలో నియంతృత్వ పోకడలతో చెలరేగుతున్న విభజిత శక్తులను ఓడించడమేనని అని చెప్పింది. ఇది కాంగ్రెస్ విషయంలో లాభిస్తుందా? అసలు అక్కడ ఎన్సీపీ ఇంకా పూర్వపు వైభవం తో ఉందా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే 2014 తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరగడంతో జమ్మూ–కాశ్మీర్ ప్రజలు పోలింగ్ లో ఉత్సాహం గా పాల్గొన్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ అయితే 70 శాతం వరకూ నమోదయింది. అది కూడా ఎటువంటి గొడవలు జరగకుండా. బాగా కల్లోలిత ప్రాంతాలని పేరు మోసిన పుల్వామా లాంటి చోట్లలో కూడా గొవలు జరగలేదు. ఇది మంచి పరిణామమనే చెప్పాలి. జమ్మూ–కాశ్మీర్ ప్రజలు కొత్త ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ మొత్తం 90 నియోజకవర్గాల్లో మూడు దశల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 46 స్థానాలు అవసరం. 2014లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ సరైన మెజారిటీ రాకపోవడంతో బీజేపీ, పీడీపీ ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అయితే ఈ సారి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఎన్సీపీ పొత్తుతో బరిలోకి దిగాయి. మరోవైపు ఎలా అయినా బీజేపీ ఈసారి ఇక్కడ అధికారంలోకి రావాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో విడుదల అయిన ఎగ్జిట్ ఫలితాలు ఆసక్తి రేపాయి. సర్వే సంస్థలు విడుదల చేసిన అంచనాల్లో కాంగ్రెస్‌కే ఎక్కువ ఓట్లు వస్తాయని చెబుతున్నా..ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లకు కొంచెం అటు ఇటూగా వస్తాయని అంటోంది. దాని ప్రకారం హంగ్ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తోంది చెబుతున్నాయి. బీజేపీకి 20 నుంచి 32 అంటోంది. కీలకంగా 16 సీట్లు.. ఆర్టికల్ 370 రద్దుకు ముందు జమ్మూ–కాశ్మీర్‌లో రిజర్వేషన్లు లేవు. కానీ ఆర్టికల్ రద్దు తర్వాత మొదటిసారి ఇక్కడ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. దీంతో ఉన్న 90 సీట్లలో 16 సీట్లను రిజర్వుడు వర్గాలకు కేటాయించారు. వీటిలో ఎస్సీలకు 7, ఎస్టీలకు 9 స్థానాలొచ్చాయి. ఈ 16 సీట్లలో 13 జమ్మూ డివిజన్‌లో ఉండగా, 3 కశ్మీర్ లోయలో ఉన్నాయి. తొలిసారిగా ఎస్‌సీ,ఎస్టీ రిజర్వేషన్ వచ్చిన కారణంగా ముఖ్యంగా రాజోరి-పూంచ్ జిల్లాలో ఇంతకు ముందు కంటే పరిస్థితులు భిన్నంగా ఉంటాయనిజజజసమీకరణాలు మరతాయని విశ్లేషకుల అంచనా. ఈ ప్రాంతంలో పహారీ, గుజ్జర్ వర్గాల వారికి అధికారం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మొత్తం 90 సీట్లలో ఈ 16 సీట్లు ఎవరికి దక్కితే వారికి అధికారం దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అంచనా ప్రకారం నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి 46-50 స్థానాలు సాధించొచ్చని వేసింది. బీజేపీ..23-27 స్థానాలు; పీడీపీ 7-11 స్థానాలు; ఏఐపీ 0-1, ఇతరులు 4-5 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు తెలిపింది. కూటమిలో నేషనల్ కాన్ఫరెన్స్ 33-35, కాంగ్రెస్ 13-15 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెబుతోంది. రిపబ్లిక్ మ్యాట్రిజ్ అయితే పీడీపీ -28, బీజేపీ -25, కాంగ్రెస్ -12, ఎన్సీపీకి - 15, ఇతరులు -7 సీట్లు గెలుచుకుంటారని చెప్పింది. అలాగే దైనిక్ భాస్కర్ ప్రకారం పీడీపీ 4-7, బీజేపీ 20-25, కాంగ్రెస్-ఎన్‌సీ కూటమి- 35-40, ఇతరులు 12-16 గెలవచ్చు. ఇండియాటుడే- సీఓటర్ సర్వేలో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమికి 40-48 సీట్లు రావొచ్చని అభిప్రాయపడింది. బీజేపీ 27-32, పీడీపీకి 6-12, ఇతరులకు 6-11 సీట్లు వస్తాయని అంచనా వేసింది. యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థ సైతం నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్‌కు 35-45 సీట్లు వస్తాయని చెప్పింది. బీజేపీ 24-34, పీడీపీ 4-6, ఇతరులకు 8-23 సీట్లు రావొచ్చని తెలిపింది. సర్వేల ప్రకారం విశ్లేషకులు అంచనా వేస్తే జమ్మూకాశ్మీర్‌లో మళ్ళీ హంగ్ తప్పదనే చెబుతున్నారు. 2014లో కూడా ఇద జరిగిందని...ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని అంటున్నారు. అదే కనుక జరిగితే మి ముఖ్యమంత్రి పీఠం మీద ఏ పార్టీ నేత కూర్చుంటారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది. ఇక్కడ అధకారం కోసం బీజేపీ ఎప్పటి నుంచో కాచుకుని కూర్చుంది. కానీ కాంగ్రెస్ అంత ఈజీగా వదులుకోదు. మరోవైప ఇక్కడ రాజల కుటుంబానికి చెందిన ఎన్సీపీ కూడా అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టపడదు. ఇలాంటి పరిస్థితిల్లో మరి కాసేపట్లో విడుదల కానున్న ఫలితాలు విపరీతమైన ఇంట్రస్ట్‌ను క్రియేట్ చేస్తున్నాయి. Also Read: National: కాంగ్రెస్ పునరజ్జీవం..హర్యానాలో ఓట్లన్నీ అటేనా? మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి