Kolkata horror: అభయ హత్యాచార ఘటనలో కీలక మలుపు.. కళాశాల మాజీ ప్రిన్సిపాల్ అరెస్టు
కోల్‌కతా హత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఆర్జీ కర్ మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఆస్పత్రికి సంబంధించి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.