Air India Crash: ఇంజిన్లు ఆగిపోయాయి.. అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ లో ఏఏఐబీ ప్రాథమిక నివేదిక

రెండు ఇంజన్ స్విచ్ లు సెకన్ పాటూ ఆగిపోవడమే అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ కు కారణమని ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగెంట్‌ బ్యూరో ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వెంటనే స్పందించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని చెప్పింది. 

New Update
Cricketer Died in Ahmedabad Air India Plane Crash  (1)

Cricketer Died in Ahmedabad Air India Plane Crash (1)

కొన్ని రోజుల క్రితం అహ్మదాబాద్ లో కూలిన విమాన ఘటన అత్యంత విషాదంగా మారని సంగతి అందరికీ తెలిసిందే. ఫ్లైట్ బయలుదేరిన కొద్ది నిమిషాలకే కూలిపోవడంతో మొత్తం 240 మంది ప్రయాణికులతో పాటూ మరో 30 మంది ప్రాణాలు పోయాయి. ప్రమాదం తర్వాత ఫోటోలు, వీడియోలు, బ్లాక్ బాక్స్ తదితర వాటిని పరిశీలించాక దీనిపై ప్రాథమిక నివేదికను సమర్పించింది ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగెంట్‌ బ్యూరో. విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్ లు సెకన్ పాటూ ఆగిపోవడమే యాక్సిడెంట్ కు కారణమని తేల్చింది. మొత్తం 15 పేజీల నివేదికను ఏఏఐబీ సమర్పించింది. రెండు ఇంజిన్లూ ఒకేసారి ఆగిపోయాయని చెప్పింది. కాక్ పిట్ లో పైలెట్ల వాయిస్ రికార్డ్ ఆధారంగా దీన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో ఇంజిన్లను ఎందుకు ఆఫ్ చేశావని ఒక పైలెట్...రెండో పైలెట్ ను అడిగారని తెలుస్తోంది. అయితే మొదటి పైలెట్ తాను స్విఛాఫ్ చేయలేదని చెప్పారని...తర్వాత మేడే కాల్ ఇచ్చారని నివేదికలో రాశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెండు ఇంజిన్లు కటాఫ్ అయినా విమానం అవసరమైన ఎత్తుకు ఎగరగలిగింది. తర్వాత రెండు ఇంజిన్లలో ఒకటి వెంటనే ఆన్ అయినా రెండో దానిని మాత్రం స్విఛాన్ చేయలేకపోయారు. 

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించే లోపునే..

పైలెట్లు మేడే కాల్ ఇచ్చిన వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించిందని ప్రాథమిక విచారణలో తేలింది. కానీ విమానం నుంచి ఎటువంటి స్పందనా రాలేదని...అప్పటికే పరిస్థితి చేయి దాటి పోయిందని ఏఏఐబీ వివరణ ఇచ్చింది. విమానానికి సంబంధించి రెండు ఇంజిన్లను వెలికితీసినట్లు, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్‌ను గుర్తించామని తెలిపింది. రెండు ఇంజిన్లను భద్రపరిచినట్లు వెల్లడించింది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని.. ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు