మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సంచలన ప్రకటన చేశారు. తాము ప్రవేశపెట్టిన పథకాల వల్లే ప్రజలు తమకు ఓటు వేశారని అన్నారు. నేను సీఎం అంటే కామన్ మ్యాన్‌గానే చూస్తానని తెలిపారు. తనకు ప్రధాని మోదీ, అమిత్ షా సపోర్ట్ ఉందన్నారు. అయితే సీఎం పదవి నిర్ణయాన్ని ప్రధాని మోదీకి వదిలేశానని చెప్పారు. బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి: Ajahn Siripanyo: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు
శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్), బీజేపీకి చెందిన ప్రముఖ నేతలను హైకమాండ్ ఢిల్లీకి పిలిపించిన సంగతి తెలిసిందే. ప్రఫుల్ పటేల్, అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండేలతో బీజేపీ హైకమాండ్ గురువారం ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనుంది. అయితే ఈ భేటీలో మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు వ్యూహంపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ముఖ్యమంత్రి ఎవరు అనేది అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Ajahn Siripanyo: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు
కొత్తగా ఏర్పడే మహాయుతి కూటమి ప్రభుత్వంలో తన కొడుకు శ్రీకాంత్ షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ఏక్‌నాథ్ షిండే పట్టుబడుతున్నట్లు సమాచారం. శ్రీకాంత్ ప్రస్తుతం కల్యాణ్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు మహాయుతి కూటమి కన్వీనర్ పదవిని కూడా తన కొడుకుకి ఇవ్వాలని షిండే డిమాండ్ చేస్తున్నట్లు జాతీయ మీడియాలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చూడండి: TG crime: తెలంగాణలో షాకింగ్ ఘటన.. రన్నింగ్ ట్రైన్లో వృద్ధురాలిని రేప్ చేసి.. !