/rtv/media/media_files/2025/09/01/educate-girls-ngo-2025-09-01-08-37-10.jpg)
Educate Girls NGO
Educate Girls NGO : భారతదేశంలో బాలికల విద్యకోసం పనిచేస్తున్న ప్రముఖ ఎన్జీవో ‘ఎడ్యుకేట్ గాళ్స్’ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే–2025 అవార్డును గెలుచుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ గౌరవాన్ని పొందిన మొదటి భారతీయ సంస్థ ఎడ్యుకేట్ గర్ల్ కావడం విశేషం. 2007లో సఫీనా హుసైన్ స్థాపించినఈ ఎడ్యుకేట్ గర్ల్స్, రాజస్థాన్‌లో ప్రారంభమై గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో పాఠశాలకు వెళ్లని బాలికలను విద్యా వైపు నడిపించే లక్ష్యంతో పనిచేస్తోంది. ఆసియా నోబెల్ బహుమతిగా పిలవబడే ఈ అవార్డు, సమాజ సేవలో అసాధారణ ధైర్యం, నిస్వార్థ సేవను ప్రదర్శించిన వ్యక్తులు, సంస్థలకు అందజేస్తోంది.
This honour belongs to everyone who has been part of the journey. Gayatri’s words capture the pride, gratitude and hope we feel as #EducateGirls receives the #RamonMagsaysayAward. #GreatnessOfSpirit#TransformativeLeadershiphttps://t.co/T10m0BxZAW
— Educate Girls (@educate_girls) August 31, 2025
రామన్ మెగసెసే అవార్డు ఫౌండేషన్ (RMAF) ఈ అవార్డు విజేతలను ఎంపిక చేస్తుంది. 2025 విజేతలకు సంబంధించి నవంబర్ 7న మనీలాలోని మెట్రోపాలిటన్ థియేటర్‌లో జరిగే 67వ అవార్డు ప్రదానోత్సవంలో మెడల్స్, సర్టిఫికేట్లు అందజేస్తారు. ‘ఎడ్యుకేట్ గాళ్స్ ద్వారా మారూమూల ప్రాంతాల్లోని బాలికలు, యువతులకు ఈ సంస్థ విద్యనందిస్తోంది. వారిలోని నైపుణ్యాలను వెలికి తీసి సామర్థ్యాన్ని, ధైర్యాన్ని నింపుతోంది.
ఎంతో నిబద్ధత, అంకితభావంతో పని చేస్తున్న సఫీనా హుస్సేన్ తన ఎడ్యుకేట్ గాళ్స్ సామాజిక సంస్థ ద్వారా ఆసియాలో అత్యున్నత గౌరవానికి ఎంపికైనట్లు రామన్ మెగసెసే అవార్డ్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన మాల్దీవులకు చెందిన షాహినా అలీ, ఫిలిప్పీన్స్‌కు చెందిన ఫ్లావియానో ఆంటోనియో ఎల్ విల్లానుయేవా కూడా ఈ అవార్డును దక్కించుకున్నవారిలో ఉన్నారు.
కాగా ఈ సందర్భంగా సఫీనా హుస్సేన్ మాట్లాడుతూ ఈ అవార్డు కేవలం ఎడ్యుకేట్ గాళ్స్‌కే కాదు.. మొత్తం దేశానికే చారిత్రాత్మకమైదని అన్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సఫీనా హుస్సేన్ 2007లో ఎడ్యుకేట్ గాళ్స్‌ను స్థాపించారు. అప్పటివరకూ శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్నత స్థితిలో పనిచేసిన ఆమె..మహిళల నిరక్షరాస్యతపై పనిచేయాలని ఇండియాకు తిరిగొచ్చారు. రాజస్థాన్‌లో తన సేవ కార్యక్రమాలను ప్రారంభించారు. చదువుకోనివారిని. బడి బయట ఉన్న బాలికలను తరగతి గదిలోకి తీసుకు రావడంలో కృషి చేశారు. లక్షలాది మంది యువతులకు ఉన్నత విద్యతోపాటు, ఉపాధి కల్పించే విద్యనందించేందుకు కృషి చేస్తున్నారు.
ఆసియా నోబెల్ బహమతిగా పిలుచుకునే రామన్ మెగసెసే అవార్డు ప్రజలకు నిస్వార్థ సేవలందించిన, సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తులు, సంస్థలకు అందజేస్తున్నారు. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే జ్ఞాపకార్థం 1957లో ఈ అవార్డును నెలకొల్పారు. రామన్ మెగసెసే పతకం అవార్డు కింద ప్రశంసా పత్రంతోపాటు నగదు బహుమతిని అందజేస్తారు. భారత్ నుంచి గతంలో రామన్ మెగసెసే అవార్డును గెలుచుకున్న వారిలో మదర్ థెరిసా (1962), జయప్రకాష్ నారాయణ్ (1965), చిత్రనిర్మాత సత్యజిత్ రే (1967), జర్నలిస్ట్ రవీష్ కుమార్ (2019), పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ (2018), అరవింద్ కేజ్రీవాల్ (2006), ఆర్టీఐ కార్యకర్త అరుణా రాయ్ (2000), కిరణ్ బేడి (1994) జర్నలిస్ట్ అరుణ్ శౌరి (1982) తదితర ప్రముఖులు ఉన్నారు.
ఇది కూడా చూడండి: Asia Cup 2025: క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఆసియా కప్ షెడ్యూల్‌లో మార్పు.. కారణమిదే!