Manmohan Singh: మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక రంగంలో ఒక కీలక వ్యక్తిగా నిలిచారు.పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న కాలంలో 1991 వ సంవత్సరం ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేశారు. ఆ సమయంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చేపట్టిన చర్యలు దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచాయి. Also Read: Ap Rains: ఏపీలో రానున్న రెండ్రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు! 1991 లో భారత్ తీవ్రమైన ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతోంది. విదేశీ మారకద్రవ్య నిధులు అత్యంత తక్కువగా ఉన్న పరిస్థితి ఏర్పడింది. కేవలం రెండు వారాల ఎగుమతులకు సరిపడా నిధులు మాత్రమే మిగిలి ఉండడం సమస్యను మరింత కఠినతరం చేసింది. అప్పట్లో విదేశీ అప్పులు భారీగా పెరిగి, రూపాయి విలువ దారుణంగా పడిపోవడం జరిగింది. Also Read: Manmohan : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి..7 రోజులు సంతాప దినాలు తక్షణమే పరిస్థితి మెరుగుపరచడానికి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఏర్పడింది. మన్మోహన్ సింగ్ ఏం చేశారంటే.. 1991లో పీవీ నరసింహారావు హయాంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే... లిబరలైజేషన్...భారత ఆర్థిక వ్యవస్థను మరింత స్వేచ్ఛగా మార్చడం జరిగింది. వ్యాపారాలకు అవసరమైన నియంత్రణలను తొలగించారు. గ్లోబలైజేషన్ : విదేశీ పెట్టుబడుల కోసం ఆకర్షించడం కోసం దీనిని ప్రవేశపెట్టారు. బహుళజాతి కంపెనీలు భారత మార్కెట్లో ప్రవేశించేందుకు అనుమతి ఇచ్చారు. ప్రైవేటీకరణ : ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు. ఎగుమతులను ప్రోత్సహించడానికి ఎగుమతి ఉత్పత్తులపై పరిమితులను తగ్గించారు.రూపాయి విలువ తగ్గించడం ద్వారా విదేశీ మార్కెట్లో భారత ఉత్పత్తులకు డిమాండ్ పెంచారు.బడ్జెట్‌లో విధానపరమైన మార్పులు చేసి, రుణదాతల నుంచి విదేశీ రుణాలను పొందారు. ఆర్థిక సంస్కరణల ఫలితాలు ఇలా.. భారత ఆర్థిక వృద్ధి రేటు 3 శాతం ఉండగా, సంస్కరణల తర్వాత ఇది 6-7 శాతానికి చేరుకుంది.ఎఫ్‌డీఐ భారీగా పెరిగింది. వివిధ రంగాల్లో ఉద్యోగాల సంఖ్య పెరిగింది. ఐటీ, మాన్యుఫాక్చరింగ్, టెలికమ్యూనికేషన్ రంగాల్లో విస్తృత అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ఐటీ రంగ అభివృద్ది ఆ కాలంలో తీసుకున్న నిర్ణయాలే పునాదులుగా మారాయి. Also Read: Manmohan Singh: ప్రముఖులతో మన్మోహన్ సింగ్ అరుదైన చిత్రాలు ఈ సంస్కరణల వల్ల భారతదేశం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రను పోషించడం జరిగింది. మధ్యతరగతి ఆదాయం పెరిగి, వినియోగం పెరిగింది. దీని వల్ల భారత్‌లో పోటీ పెరిగి, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు చాలా వరకు తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న భారతదేశం, ఈ సంస్కరణల ద్వారా అంతర్జాతీయ రుణదాతల నమ్మకాన్ని పెంచేలా చేసింది. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ నుండి రుణ సాయం పొందడం, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడం సాధ్యమైంది. భారత రూపాయిపై విశ్వసనీయత పెరిగి, దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడింది. Also Read: Manmohan Singh: పాకిస్తాన్‌లో పుట్టి భారత ప్రధానిగా ఎదిగి... ఆర్థిక సంక్షోభం నుంచి భారత్‌ను బయటపడే దిశలో ఆయన చేసిన కృషి దేశ చరిత్రలో ఓ విప్లవాత్మక మైలురాయిగా నిలిచింది. 1991లో ప్రారంభమైన ఆర్థిక మార్పులు భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా మార్చి నిలబెట్టింది.