BIG BREAKING: రాత్రి కశ్మీర్ పై పాక్ డ్రోన్ దాడి?: కేంద్రం కీలక ప్రకటన!

జమ్మూ కశ్మీర్ లోని సరిహద్దులో కూడా  పాక్ కాల్పులకు పాల్పడినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. జమ్మూ కశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలలో డ్రోన్లు కనిపించాయని వైరల్ అవుతున్న పోస్టులు ఫేక్ అని తేల్చింది.

New Update
drone pak j and k

drone pak j and k

ఆపరేషన్‌ సిందూర్‌ తరువాత ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో- ఆమెరికా జోక్యంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఆంగీకరించాయి. అయితే ఈ కాల్పుల విరమణను పాక్‌ కొన్ని గంటల్లోనే బ్రేక్ చేసింది. శనివారం అర్థరాత్రి జమ్మూ కశ్మీర్ సరిహద్దులో పాక్ డ్రోన్లతో విరుచుకపడింది. అందుకు ధీటుగా భారత బలగాలు కూడా సమాధానం ఇచ్చాయి. అటు ఆదివారం కూడా  రాజస్థాన్ లోని బారాముల్లాలోనూ పాక్ డ్రోన్ కనిపించగా.. భారత సైన్యం దానిని ఆకాశంలోనే కూల్చివేసింది. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించారు. స్థానికులు ఎవరూ కూడా ఇంట్లో నుంచి బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు.  

కేంద్రం క్లారిటీ

అయితే జమ్మూ కశ్మీర్ లోని సరిహద్దులో కూడా  ఆదివారం పాక్ కాల్పులకు పాల్పడినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. జమ్మూ కశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలలో డ్రోన్లు కనిపించాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు ఫేక్ అని తేల్చింది. జమ్మూ కశ్మీర్ లో డ్రోన్ కార్యకలాపాలు లేవని పేర్కొంది. ఇక ఉధంపూర్‌లో భారీ పేలుళ్లు జరిగాయనే వాదనలు పూర్తిగా అబద్దమని స్పష్టం చేసింది. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని తెలిపింది.  

india | pakistan | Jammu and Kashmir | telugu-news

Advertisment
తాజా కథనాలు