భద్రతా దళాలు రక్షణ కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరిస్తారు. అవి కాస్త బరువుగా ఉంటాయి. అయితే 360 డిగ్రీల రక్షణ ఇచ్చే తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను డీఆర్‌డీవో రూపొందించింది. ఐఐటీ- ఢిల్లీతో కలిసి వీటిని తయారు చేసినట్లు రక్షణశాఖ పేర్కొంది. అధిక ముప్పు స్థాయిలను ఇది సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తెలిపింది. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌కు ABHED ( అడ్వాన్స్‌డ్ బాలిస్టిక్ ఫర్ హైఎనర్జీ డిఫీట్ ) అని పేరు పెట్టారు. ఐఐటీ దిల్లీలోని డీఆర్‌డీవో ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో దీన్ని అభివృద్ధి చేశారు.
Also Read: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. దసరాకు ఇందిరమ్మ కమిటీలు!
ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మూడు పరిశ్రమలకు బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణ శాఖ వెల్లడించింది. 8.2 కేజీలు, 9.5 కేజీల కనీస బరువుతో వివిధ బీఐఎస్ ప్రమాణాల మేరకు వీటిని రూపొందించినట్లు తెలిపింది. 360 డిగ్రీల రక్షణను అందించే ఈ జాకెట్ ముందు, వెనక కవచాలు ఇవి కలిగి ఉంటాయని పేర్కొంది. ఈ జాకెట్లను పాలిమర్లు, స్వదేశీ బోరాన్ కార్బైడ్ సిరామిక్ పదార్థాలు ఉపయోగించి తయారు చేసినట్లు వెల్లడించింది.