ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. కరేబియన్‌లో ఉండే డొమినికా అనే ద్వీప దేశం ఆయనకు అత్యున్నత జాతీయ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు డొమినికా ప్రభుత్వం గురువారం ఓ ప్రకటనను విడుదల చేసింది. కరోనా సమయంలో భారత్ అనేక దేశాలకు సాయం చేసింది. అందులో డొమినికా కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కరోనా సమయంలో భారత్ అందించిన సహకారానికి గుర్తుగా ఈ అత్యున్న జాతీయ పురస్కారాన్ని అందించనున్నట్లు పేర్కొంది.
Also Read: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. ఆరు భాషల్లో స్వామి చాట్‌బాట్
Civilian Award To PM Modi
అలాగే భారత్, డొమినికాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ ఎంతగానో కృషి చేశారని ప్రశంసించింది. వచ్చేవారమే గయానాలో జరిగే ఇండియా-కరికోమ్ సదస్సులో ఈ అవార్డును అందించనున్నట్లు తెలిపింది. నవంబర్ 19 నుంచి 21 వరకు ఈ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా డొమినికా ప్రధాన కార్యాలయం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
Also Read : నన్ను ఏం అడిగారంటే.. విచారణ తర్వాత చిరుమర్తి లింగయ్య సంచలన వ్యాఖ్యలు!
''2021 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ డిమినికాకు 70 వేల కొవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపించింది. భారత్ అందించిన ఈ అపురూపమైన సహకారం వల్ల మేము మా పొరుగు దేశాలకు కూడా అండగా నిలిచాం. అలాగే ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఆరోగ్యం, విద్య, ఐటీ రంగంలో భారత్ మాకు మద్దతుగా నిలుస్తోంది. భారత్ మాకు గొప్ప భాగస్వామి. ఇందుకోసమే ఆ దేశ ప్రధాని మోదీకి.. మా దేశ అత్యున్నత జాతీయ పురస్కారంతో గౌరవించాలని నిర్ణయించామని'' డొమినికా ప్రధాన కార్యాలయం తెలిపింది.
Also Read: మోదీ కీలక నిర్ణయం.. స్థానిక భాషల్లో ఇకపై మెడిసిన్
ఇదిలాఉండగా 2020లో వెలుగు చూసిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎలా వణికించిందో అందరికీ తెలిసిందే. కోట్లాదిమంది ఈ వ్యాధి బారిన పడ్డారు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ సైతం కుదేలైపోయింది. ఇక కరోనా సెకండ్ వేవ్ వల్ల భారత్‌లో చాలా మరణాలు సంభవించాయి. అయితే ఈ మహమ్మారి ఇంకా మన మధ్యే ఉన్నప్పటికీ ప్రస్తుతం దీని ప్రభావం చాలవరకు తగ్గిపోయింది. దీనికి సంబంధించిన వ్యాక్సిన్లు కూడా అందరికీ అందుబాటులకి వచ్చేశాయి.
Also Read : తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు..హైకోర్ట్ కీలక నిర్ణయం, నటి కస్తూరి అరెస్ట్?