Karolina Goswami: పోలాండ్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ కరోలినా గోస్వామి.. తనపై మరో యూట్యూబర్ ధ్రువ్ రాథీ అభిమానులు దాడికి పాల్పడ్డట్లు ఆరోపిస్తోంది. 'ఇండియా ఇన్ డిటైల్స్' అనే యూట్యూబ్ చానల్ నడిపిస్తున్న ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కాగా ద్రువ్ రాథీ గ్యాంగ్ నుంచి తనకు బెదిరింపులు వచ్చినట్లు తన చానెల్ ద్వారా వెల్లడించింది. గతంలోనూ జర్మనీలో ధృవరాఠీ అభిమానులు తనపై దాడి చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎమోషనల్ అయింది.
ఇది కూడా చదవండి: కలకలం రేపుతున్న బాంబు బెదిరింపులు.. మరో 3 విమానాలకు..
ఈ మేరకు ధ్రువ్ రాథీ ఆరోపించిన తప్పుడు సమాచారాన్ని తాను బహిర్గతం చేసినందుకు అతని మద్దతుదారుల నుండి 220 కంటే ఎక్కువసార్లు బెదిరింపులు వచ్చినట్లు కరోలినా గోస్వామి చెప్పింది. ఇందులో భాగంగానే తాను ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో తాను నడుస్తున్నట్లు చూపించే వీడియోను విడుదల చేసింది. 'మేము దేనికీ భయపడం. భారతదేశంలో జీవించడం కొనసాగిస్తాం' అంటూ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చింది. దీనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 4.5 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం.
ఇది కూడా చదవండి: TG News: ఓఎల్‌ఎక్స్‌లో ప్రభుత్వ భూమి అమ్మకాలు.. తక్కువ ధరకే ఫ్లాట్లు!
ఇక జర్మనీకి చెందిన ధృవ్ రాథీ తన యూట్యూబ్ ఛానెల్ 'ఇండియన్ ఇన్ డిటైల్స్'లో నకిలీ వార్తలను వ్యాప్తి చేసినందుకు అతనిని సోషల్ మీడియా నుండి నిషేధించాలని గోస్వామి డిమాండ్ చేశారు. అంతేకాదు ధృవ్ రాథీ అభిమానులు తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అత్యాచార బెదిరింపులకు ప్పాల్పడిన స్క్రీన్‌షాట్‌లను ఆమె షేర్ చేశారు. గతంలోనూ తనకు వచ్చిన అత్యాచార బెదిరింపుల కారణంగా తనకు భద్రత కల్పించాలని గోస్వామి మేలో భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: ప్రేమ నిరాకరించిందని.. ఇంటర్ అమ్మాయిని దారుణంగా చంపిన యువకుడు!
కరోలినా గోస్వామి ఎవరు?
కరోలినా గోస్వామి ఎవరు? కరోలినా గోస్వామి పోలాండ్ పౌరురాలు. ఆమె ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డ్ హోల్డర్. కరోలినా తన భర్త అనురాగ్, పిల్లలతో భారతలో నివసిస్తోంది. వీరికి 'ఇండియా ఇన్ డిటైల్స్' అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. వీరి ఛానెల్‌లో 1.1 మిలియన్ కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఛానెల్‌ని కరోలినా ఆమె భర్త ఇద్దరూ నడుపుతున్నారు.
ఇది కూడా చదవండి: పోలీసులు ఆకస్మిక దాడులు.. పబ్‌లో యువతులతో అసభ్యకరమైన డ్యాన్సులు