/rtv/media/media_files/2025/08/26/pujari-2025-08-26-09-46-36.jpg)
కర్ణాటక(karnataka) లోని తుమకూరులోని దేవరాయణ దుర్గ ఆలయంలో పూజారి(Attack on Priest) పై మహిళలు, యువకులు దారుణంగా దాడి చేశారు. వృద్ధుడును అని కూడా చూడకుండా దాడి చేశారు. దేవరాయణ దుర్గ ఆలయ పూజారి నాగభూషణాచార్యుడిపై ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు చేతులు, కర్రలతో దాడి చేశారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుంకుమ పూస్తూ ఓ మహిళ భక్తురాలితో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఆలయ మెట్ల దగ్గర పూజారిని చుట్టుముట్టి ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు ఆయనపై చేతులు, కర్రలతో దాడి చేశారు. సదరు పూజారి తనను కొట్టవద్దని దండం పెట్టాడు. మహిళ కాళ్లు మొక్కి వేడుకున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ತುಮಕೂರಿನ ದೇವರಾಯನದುರ್ಗ ಬೆಟ್ಟದಲ್ಲಿ ಅರ್ಚಕರ ಮೇಲೆ ಕುಟುಂಬವೊಂದು ಹಲ್ಲೆ ಮಾಡಿರುವ ಘಟನೆ ನಡೆದಿದೆ. ಈ ಘಟನೆ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ಯಾರ ಬಳಿಯಾದರೂ ಇದೆಯೇ? ಅವರು ಆರೋಪ ಮಾಡುತ್ತಿರುವುದು ನಿಜವೇ pic.twitter.com/CfaNK02dPF
— 👑Che_Krishna🇮🇳💛❤️ (@CheKrishnaCk_) August 24, 2025
Also Read : కొండల్లో చిక్కుకున్న వందలాది టూరిస్టులు.. విరిగిపడ్డ కొండచరియలు
మానసికంగా బాధపడుతున్నా
ఈ సంఘటన గురించి దాడికి గురైన పూజారి నాగభూషణాచార్య మీడియాతో మాట్లాడుతూ, "నిన్న మధ్యాహ్నం నాపై దాడి జరిగింది. నేను చేయని తప్పుకు నేను మానసికంగా బాధపడుతున్నాను. ఆలయ సంప్రదాయం ప్రకారం, ప్రసాదం ఇవ్వడానికి మాకు ఒక విధానం ఉంది. అందరికీ మంచి చేయాలనే ఉద్దేశ్యంతో నేను దాదాపు 25 సంవత్సరాలుగా ఈ సేవ చేస్తున్నాను. ఇప్పటివరకు ఎవరూ నా పట్ల చెడుగా ప్రవర్తించలేదు. నేను ఇప్పటివరకు గౌరవంగా జీవించాను" అని ఆయన అన్నారు. ఈ విషయం గురించి మా ఉన్నతాధికారులకు కూడా తెలియజేసాను. కాట్సంద్ర పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశాను. నాకు న్యాయం చేయాలని నేను అభ్యర్థించాను అని పూజారి వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులు ఇంకా అధికారికంగా కేసు నమోదు చేయలేదు. అయితే, పూజారి నాగభూషణాచార్య దాడి చేసిన వ్యక్తులు తన చర్యను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను కేవలం కుంకుమ పెట్టే క్రమంలోనే అలా జరిగిందని వాదించాడు. ఈ సంఘటన దేవాలయాలలో మహిళల భద్రత, పూజారుల నైతిక ప్రవర్తనపై తీవ్ర చర్చకు దారితీసింది. నెటిజన్లు కూడా ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : నిద్రలేచింది మహిళా లోకం.. ఎంప్లాయ్‌మెంట్‌లో వాళ్లే 40శాతం
మరోవైపు మధ్యప్రదేశ్‌లో అత్యంత అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. భార్య కాళ్లు, చేతులు కట్టేసి వేడి కత్తితో ప్రైవేట్ పార్ట్‌లో కాల్చిడో శాడిస్ట్ భర్త. నొప్పితో అరుస్తోందని నోట్లో వేడి కత్తి పెట్టి చిత్రహింసలు పెట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖర్‌గోన్ జిల్లాకు చెందిన యువకుడితో బాధిత యువతికి వివాహం జరిగింది. పెళ్లైన మొదటి రాత్రి నుంచే భార్యకు వేధింపులు మొదలయ్యాయి. నిత్యం తాగొచ్చి వంటగదిలోకి ఈడ్చుకెళ్లి చిత్రహింసలు పెట్టేవాడు భర్త. ఎలాగోలా భర్త నుంచి తప్పించుకుని బయటికొచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు.