Devendra Fadnavis: ఫడ్నవీస్ ఔరంగజేబు వంటి క్రూరుడు: కాంగ్రెస్‌

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ హర్షవర్ధన్‌ సప్కల్‌ తీవ్రంగా విమర్శలు చేశారు. ఫడ్నవీస్ ఔరంగజేబు వంటి క్రూరుడని అన్నారు. దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ మరింత దిగజారిపోయిందంటూ విమర్శలు చేసింది.

New Update
CM Devendra Fadnavis

CM Devendra Fadnavis

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ హర్షవర్ధన్‌ సప్కల్‌ తీవ్రంగా విమర్శలు చేశారు. ఫడ్నవీస్ ఔరంగజేబు వంటి క్రూరుడని అన్నారు. '' ఔరంగజేబు క్రూరమైన పరిపాలకుడు. అతడు తన సొంత తండ్రినే జైల్లో పెట్టాడు. ఇప్పుడున్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా అలాంటి క్రూర స్వభావం ఉన్నవారే. మతాన్ని ఆధారంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు యత్నిస్తాడు. కాబట్టి వీళ్లి్దరి పరిపాలన ఒకే విధంగా ఉంటుందని'' హర్షవర్ధన్ అన్నారు.  

Also Read: పాకిస్థాన్‌లో ఎయిర్‌పోర్టులో దాడులు.. మరో ఉగ్రవాది హతం !

మరోవైపు ఫడ్నవీస్‌ను ఔరంగజేబుతో పోల్చడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర రాజకీయ సంస్కృతికి ఉన్న గుర్తింపును అవమానిస్తూ కాంగ్రెస్ మరింత దిగజారిందంటూ విమర్శించింది.     ఔరంగజేబుతో ఫడ్నవీస్‌ను పోల్చడం.. కాంగ్రెస్‌ బాధ్యతారాహిత్యాన్ని, పిల్ల చేష్టలను సూచిస్తున్నాయని ధ్వజమెత్తింది. ఇలా చేస్తే ప్రజల్లో పార్టీకి ఉన్న కాస్త మద్దతు కూడా పూర్తిగా పోతుందని తెలిపింది. 

ఇదిలాఉండగా ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ జీవిత కథ ఆధారంగా 'ఛావా' సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలయ్యాక మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును కీర్తిస్తూ మహారాష్ట్రకు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అసీమ్ నజ్మీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మరీ ముఖ్యంగా శంభాజీ మహారాజ్‌ను చిత్రహింసలు పెట్టిన ఔరంగజేబును ప్రశంసించడంపై మహాయుతి కూటమి ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read: బట్టతలపై భార్య హేళన చేయడంతో.. భర్త ఆత్మహత్య

దీంతో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయనపై చర్యలకు పాల్పడింది. బడ్జెట్ సమావేశాల ముగిసేవరకు అంటే మార్చ 26 వరకు ఆయనపై సస్పెన్షన్ విధిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు దీనిపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ కూడా స్పందించారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు అతడిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.  

Advertisment
తాజా కథనాలు