/rtv/media/media_files/2025/02/07/aViQu0logpxZacrtK0CR.jpg)
Delhi LG Saxena orders probe into AAP's 'Operation Lotus' allegations against BJP
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ ఆపరేషన్ లోటస్ పేరుతో ఆప్ అభ్యర్థులకు గాలం వేస్తోందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. అయితే బీజేపీ దీన్ని ఖండించింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సెనా విచారణకు ఆదేశించారు. ఫిబ్రవరి 5న దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
Also Read: కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన పాకిస్థాన్ హిందువులు
అయితే బీజేపీ తమ పార్టీ అభ్యర్థులను లాక్కోవాలని చూస్తోందని.. పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫోన్ చేసి రూ.15 కోట్లు ఇస్తామని ఆశ చూపినట్లు కేజ్రీవాల్, ఇతర నేతలు గురువారం ఆరోపించారు. తప్పుడు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు నిర్వహించి తమ పార్టీ అభ్యర్థులను భయపెట్టి బీజేపీలో చేర్చుకునేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా కూడా తమ నేతలు వారికి లొంగిపోరని అన్నారు. వాళ్లు ఓడిపోతామని భయపడుతున్నారని అందుకే తమ పార్టీ నేతలను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు.
అయితే ఆప్ చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందనే భయంతో ఆప్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడింది. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ కార్యదర్శి విష్ణు మిట్టల్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశారు. తమపై ఆప్ చేసిన ఆరోపణలపై సీబీఐతో విచారణ చేయించాలని.. వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో దీనిపై విచారణ చేపట్టాలని ఎల్‌జీ ఆదేశించారు.
ఇదిలాఉండగా ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరిగగా.. ఫలితాలు 8న విడుదల కానున్నాయి. మెజార్టీ సర్వేలు బీజేపీ గెలుస్తుందని అంచనా వేయగా.. కేకే అనే పోల్ సంస్థ తమ సర్వేలో ఆప్ గెలుస్తుందని చెప్పింది. ఓ వైపు బీజేపీ, మరోవైపు ఆప్ తామే గెలుస్తామంటూ ధీమాగా ఉన్నాయి. మరి ఢిల్లీ ప్రజలకు ఎవరికి అధికారం పీఠం అప్పగించారో తెలియాలంటే రేపటి వరకు వేచిచూడాల్సిందే.