/rtv/media/media_files/2025/03/24/atlXB1P0UcoBZF3jAHAS.jpg)
Delhi Girl Finds 10 Euros Inside Pant Purchased From Janpath Market
అదృష్టం ఎవరిని ఎప్పుడు, ఎలా తడుతుందో తెలియదు. ఊహించని విధంగా కొందరు కోటీశ్వరులవుతారు. అలాంటిదే తాజాగా జరిగింది. అదృష్టం అయితే తట్టింది కానీ.. అందరూ ఊహించినంత పెద్ద లక్కు అయితే కాదు. నైనా అనే అమ్మాయి ఢిల్లీలోని ఫేమస్ జాన్‌పథ్ మార్కెట్‌కి వెళ్లింది. ఆ మార్కెట్‌లో చాలా చీప్ ధరకే బట్టలు దొరుకుతాయి.
ఇది కూడా చూడండి: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి
ప్యాంట్ జేబులో డబ్బులు
జాన్ పథ్‌లోని సరోజినీ నగర్ మార్కెట్‌లో అతి తక్కువ ధరకే పురుషులు, స్త్రీలకు సంబంధించిన బట్టలు దొరుకుతాయి. అక్కడకు వెళ్లింది నైనా అమ్మాయి. అక్కడ తనకు నచ్చిన ప్యాంట్స్ కొని ఇంటికి తీసుకెళ్లింది. త్వరగా ప్యాంట్ వేసుకోవాలని చూసింది. అదే సమయంలో ప్యాంట్ జేబులో చేయిపెట్టి చూసింది.
ఇది కూడా చూడండి: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్
అలా చూడగా.. ఇక్కసారిగా ఆమె చేతికి ఏవో పేపర్లు తగిలినట్లు అనిపించింది. వెంటనే ఆమె తన చేతికి తగిలిన వాటిని జేబులోంచి బయటకు తీసి చూసింది. ఒక్కసారిగా అవాక్కైంది. ఊహించని ఆనందంతో ఎగిరి గంతేసింది. ఆ జేబులో రెండు 5 యూరో నోట్లు కనిపించాయి. అంటే మొత్తం 10 యూరోలు. భారత కరెన్సీ ప్రకారం.. రూ.929. అందుకు సంబంధించి నైనా సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఆ పోస్టు క్షణాల్లోనే వైరల్‌గా మారిపోయింది.
Guys I found 10 euros in the pant I bought @ janpath today pic.twitter.com/gp1Jk0KukV
— naina (@asapismyjesus) March 21, 2025
ఇది కూడా చదవండి: బంగారం ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ఏకంగా 3 లక్షల వ్యూస్‌తో ట్రెండింగ్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే.. రియల్ లైఫ్ క్యాష్ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఆ బట్టలు ఎక్కడ నుంచి వచ్చి ఉంటాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే జాన్‌పథ్, సరోజినీ నగర్ వంటి చీపెస్ట్ మార్కెట్లలో యూరప్ నుంచి సెకండ్ హ్యాండ్ బట్టలు దిగుమతి అవుతాయని చాలా మంది అంటున్నారు. ఏది ఏమైనా నైనాకి ఇదొక జాక్ పాట్ అనే చెప్పాలి.
ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగారా.. షెడ్యూల్ విడుదల!
(viral-news | latest-telugu-news)
Follow Us