Delhi Bomb Blast: ఢిల్లీ బాంబు పేలుడు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో మృతులు సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ దాడిలో మృతుల సంఖ్య 13కి పెరిగింది. 30 మందికి పైగా గాయాలపాలయ్యారు.

New Update
Delhi bomb blast updates

Delhi bomb blast updates

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో 8 మంది మృతి చెందారు. 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. i20 కారులో ఈ పేలుడు సంభవించగా మిగతా వాహనాలకు కూడా మంటలు వ్యాపించాయి. ప్రస్తుతం ఈ ఘటనపై NIA, NSG దర్యాప్తు చేస్తోంది. సాయంత్రం 6.52 గంటలకు ఈ పేలుడు జరిగిందని ఢిల్లీ నగర పోలీస్ కమిషనర్‌ వెల్లడించారు. ఎర్రకోటకు సమీపంలో ఆ కారు నిదానంగా వచ్చి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిందని.. ఆ సమయంలోనే ఒక్కసారిగా పేలుడు జరిగినట్లు పేర్కొన్నారు. 

Also Read: ఉగ్రమూకలకు టార్గెట్ ఢిల్లీ.. 7సార్లు బ్లాస్.. 140 మందికి పైగా మృతి..!

మరోవైపు ఈ బాంబు పేలుడుపై ప్రధాని మోదీ ఆరా తీశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అమిత్‌ షా కూడా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌ను కూడా  ఆయన ఆరా తీస్తున్నారు. క్షతగాత్రులకు LLNP ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఆస్పత్రికి చేరుకున్న అమిత్ షా క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.  

Also Read: వణుకుపుట్టించే బాంబ్ బ్లాస్ట్ విజువల్స్.. ముక్కలు ముక్కలైన డెడ్ బాడీస్

Advertisment
తాజా కథనాలు