Delhi Airport: సెంట్రల్ గవర్నమెంట్‌పై ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ దావా

రక్షణశాఖకు చెందిన విమానాశ్రయంలోకి వాణిజ్య విమానాలను అనుమతించడాన్ని సవాల్‌ చేస్తూ జీఎంఆర్‌ సంస్థ దావా వేసినట్లు  తెలిపింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాల యాజమాన్యంలో జీఎంఆర్‌కు మెజారిటీ వాటా ఉంది. కేంద్రంపై ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ కోర్టులో దావా వేసింది.

New Update
delhi airport

delhi airport Photograph: (delhi airport)

కేంద్రంపై ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ కోర్టులో దావా వేసింది. రక్షణశాఖకు చెందిన విమానాశ్రయంలోకి వాణిజ్య విమానాలను అనుమతించడాన్ని సవాల్‌ చేస్తూ జీఎంఆర్‌ సంస్థ దావా వేసినట్లు  తెలిపింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాల యాజమాన్యంలో జీఎంఆర్‌కు మెజారిటీ వాటా ఉంది. గతేడాది దాదాపు 73.6 మిలియన్ల మంది ప్రయాణికులు దీనిని ఉపయోగించారు. ప్రభుత్వ రుసుములు పెరగడం వల్ల దాదాపు 21 మిలియన్‌ డాలర్లు నష్టపోయింది. గాజియాబాద్‌ విమానాశ్రయంలోకి వాణిజ్య విమానాలను అనుమతిస్తే దిల్లీ విమానాశ్రయం ఆర్థికంగా నష్టపోతుందని మార్చి 10న న్యాయస్థానంలో సూట్ ఫైల్ చేసింది జీఎంఆర్ సంస్థ. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా లేకపోతే ఒక విమానాశ్రయానికి, మరో విమానాశ్రయానికి మధ్య 150 కి.మీ దూరం ఉండాలనే నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించిందని అధికారులు దావాలో తెలిపారు.

Also read: Houthis attack: అమెరికాపై మోతీల వరుస దాడులు.. ప్రతీకారం తీర్చుకుంటామంటూ వార్నింగ్

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు దాదాపు 30 కి.మీ దూరంలో ఉన్న హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి కొనసాగుతున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులకు ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోర్టును కోరారు. కాగా ఈ విషయంపై భారత విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించాల్సి ఉంది. ప్రపంచంలోని అత్యంత రద్దీ గల విమానాశ్రయాల్లో ఢిల్లీ విమానాశ్రయం ఒకటి.

Also read: Sunita Williams : భూమి మీదకొచ్చాక నడవలేని పరిస్థితిలో సునీతా విలియమ్స్.. చాలా హెల్త్ ప్రాబల్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు