Sunita Williams : భూమి మీదకొచ్చాక నడవలేని పరిస్థితిలో సునీతా విలియమ్స్.. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్

సునీతా విలియమ్స్, విల్మోర్లు భూమి మీదకు రాగానే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. 9 నెలలుగా తక్కువ గురుత్వాకర్షణకు అలవాటు పడిన వారి కండరాలు, ఎముకల కదలికలలో సమస్యలు వస్తాయి. బాడీ బ్యాలెన్స్, హార్ట్ బీట్‌ నార్మల్ అవ్వడానికి ట్రీట్‌మెంట్, వ్యాయామం అవసరం.

New Update
sunita williams and butch wilmore

sunita williams and butch wilmore

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు 9 నెలల తర్వాత భూమి మీదకు తిరిగి రానున్నారు. వారు ఇంటర్‌నేషనల్ స్పేస్ స్టేషన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి 2024 జూన్‌లో వెళ్లారు. వారు వెళ్లిన స్పేస్‌షిప్ క్యాప్యుల్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా క్యాప్యుల్ మాత్రమే భూమి మీదకు తిరిగి వచ్చింది. ఇద్దురు వ్యోమగాములు అక్కడే చిక్కుకుపోయారు. 2025 మార్చి 18న వారు భూమి మీదకు తిరిగి రానున్నారు.

Also read: International Space Station : అక్కడ 24గంటల్లో 16 సార్లు సూర్యోదయం, 16 సార్లు సూర్యాస్తమయం

అంతరిక్షంలో, భూమి మీద వాతావరణ పరిస్థితులు వేరుగా ఉంటాయి. దీంతో ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ కొన్ని రోజుల దాకా పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొననున్నారు. స్పే్స్ స్టేషన్‌లో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి.. ఇన్ని రోజులు వారు గాలిలోనే తేలియాడారు. సడెన్‌గా భూమి మీదకు వచ్చి నడవడం వంటివి చేయాలంటే వారికి చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా వారు కొన్ని  అనారోగ్య సవాళ్లు ఎదుర్కొననున్నారు. కొన్ని నెలలు, రోజులపాటు ట్రీట్‌మెంట్, వ్యాయామం అవసరం. వారు సాధారణ పరిస్థితికి వచ్చేంత వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచుతారు.

కండరాలు, ఎముకల క్షీణత

అంతరిక్షంలో తక్కువ గురుత్వాకర్షణ వాతావరణంలో జీవించడం వల్ల కండరాల క్షీణత, ఎముక సాంద్రత తగ్గుతుంది. ఆస్ట్రోనాట్స్ భూమిపై ఉన్నప్పుడులా కండరాలు కదిలించలేరు. కాబట్టి, కాలక్రమేణా వారి బలం తగ్గుతుంది. అంతరిక్షంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పటికీ, వారు బలహీనతను అనుభవించవచ్చు. పూర్తి బలాన్ని తిరిగి పొందడానికి కొంత టైం పడుతుంది. 

బాడీ బ్యాలెన్సింగ్ అండ్ కో ఆర్డినేషన్ ప్రాబ్లమ్స్

నెలల తరబడి అంతరిక్షంలో గడిపారు కాబట్టి.. సునీతా విలియన్స్, బుచ్ విల్మోర్‌ల బాడీ బ్యాలెన్సింగ్, శరీర అవయవాల సమతుల్యత కదలికలను నియంత్రించే వ్యవస్థ సూక్ష్మ గురుత్వాకర్షణకు అలవాటుపడుతుంది. భూమికి తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాములు తలతిరగడం, దిక్కుతోచని స్థితి, నడవడానికి ఇబ్బంది పడవచ్చు. భూమి గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా వారి శరీరం మారాలంటే రోజులు లేదా వారాల టైం పట్టవచ్చు.

Also Read: పాకిస్థాన్‌లో ఎయిర్‌పోర్టులో దాడులు.. మరో ఉగ్రవాది హతం !

హృదయనాళాల సమస్య

అంతరిక్షంలో శరీరంలోని ద్రవాలు పైకి కదులుతాయి. దీనివల్ల రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి. తిరిగొచ్చిన వ్యోమగాములు భూమిపై నిలబడి ఉన్నప్పుడు తక్కువ రక్తపోటు, తలతిరుగుతూ ఉండవచ్చు. ఎముకల కదలికల్లో నొప్పి ఉంచవచ్చు. ఇది నార్మల్ కాడానికి డాక్టర్లతో ట్రీట్‌మెంట్, వ్యాయామం అవసరం.

కంటిచూపు తగ్గడం

కొంతమంది వ్యోమగాములు పుర్రెలో ద్రవం పేరుకుపోవడం వల్ల వారి కంటి చూపులో మార్పులు సంభవిస్తాయి, ఇది కంటి ఆకారాన్ని ప్రభావితం చేస్తుంది. స్పేస్‌ఫ్లైట్-అసోసియేటెడ్ న్యూరో-ఓక్యులర్ సిండ్రోమ్ (SANS) అని పిలువబడే ఈ పరిస్థితి అస్పష్టమైన దృష్టికి కారణమవుతుంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు