దేశరాజధాని ఢిల్లీలో రోజురోజుకీ వాయు కాలుష్యం పెరిగిపోతుంది. వరుసగా మూడో రోజు ఏక్యూఐ తీవ్రస్థాయిలో ఉంది. ఈ రోజు వాయు నాణ్యత సూచీ 428గా నమోదైంది. వాయు కాలుష్యం పెరగడంతో ఢిల్లీలో ప్రాథమిక స్కూళ్లకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ సీఎం అతిశీ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ కాలుష్యం నేపథ్యంలో ఆరు నుంచి మిగతా తరగతులు స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తప్పకుండా మాస్క్ ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇది కూడా చూడండి: అయ్యప్ప దర్శనాలకు పోటెత్తిన భక్తులు..తొలిరోజే ఎంతమందంటే?
ట్రాఫ్రిక్‌ను దృష్టిలో పెట్టుకుని..
పొగమంచుకి దారి కూడా సరిగ్గా కనబడక ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగిపోతుంది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను మార్చారు. ఢిల్లీ మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8.30 నుంచి 5 గంటల వరకు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 వరకు, దిల్లీ ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేయాలని సీఎం అతిశీ ఆదేశించారు.
ఇది కూడా చూడండి: మెడికల్ కాలేజ్‌లో అగ్ని ప్రమాదం..10 మంది చిన్నారులు సజీవదహనం
ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతున్న కారణం వల్ల అవసరం లేని నిర్మాణాలు చేపట్టకూడదని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కూల్చివేతలపై కూడా నిషేధం విధించింది. వీటితో పాటు బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ వాహనాల ప్రయాణాలను నిషేధించాయి. త్వరలో 106 క్లస్టర్ బస్సులు, మెట్రో సేవలను కూడా మరింత పెంచుతామని ప్రభుత్వం తెలిపింది.
ఇది కూడా చూడండి: చివరి మ్యాచ్‌లో గెలుపు..3–1తో సీరీస్ కైవసం
ఢిల్లీలో ఉండే కాలుష్యానికి అక్కడి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. గాలి నాణ్యతను పెంచడానికి కూడా ప్రయత్నిస్తోంది. ఈ కాలుష్యం వల్ల ఢిల్లీలో చాలా కుటుంబాలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాయి. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు.
ఇది కూడా చూడండి: రీల్స్ చేస్తే జైలుకే..రైల్వే బోర్డు సీరియస్ డెసిషన్